36 ఏండ్ల తర్వాత వింబుల్డన్ జూనియర్స్ క్వార్టర్స్లోకి మనోడు..

లండన్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ అర్నవ్ పాపర్కర్ వింబుల్డన్ జూనియర్స్ బాయ్స్ సింగిల్స్‌లో చరిత్ర సృష్టించాడు. జపాన్‌కు చెందిన ర్యో టబాటాపై 6-–2, 6–-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. దీంతో 36 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్నవ్ నిలిచాడు. చివరిసారిగా 1990లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ దశకు చేరాడు.
ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న 18ఏండ్ల అర్నవ్.. రెండోరౌండ్‌లో మూడో ర్యాంకర్ కీటన్ హాన్స్ (అమెరికా)ను 6-–2, 6–-3తో ఓడించి సంచలనం సృష్టించాడు. మహారాష్ట్రలోని హేమంత్ బెంద్రే టెన్నిస్ అకాడమీలో కోచ్ ప్రసోంజిత్ పాల్ అండర్లో శిక్షణ పొందుతున్నాడు.
అర్నవ్‌కు మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, మహాటెన్నిస్ ఫౌండేషన్ సపోర్ట్ అందిస్తున్నాయి. భారత యువ టెన్నిస్ ప్లేయర్ అర్నవ్ పాపర్కర్ వింబుల్డన్ జూనియర్స్ బాయ్స్ సింగిల్స్‌లో చరిత్ర సృష్టించాడు. జపాన్‌కు చెందిన ర్యో టబాటాపై 6-–2, 6–-1తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
దీంతో 36 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్నవ్ నిలిచాడు. చివరిసారిగా 1990లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఈ దశకు చేరాడు. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న 18ఏండ్ల అర్నవ్.. రెండోరౌండ్‌లో మూడో ర్యాంకర్ కీటన్ హాన్స్ (అమెరికా)ను 6-–2, 6–-3తో ఓడించి సంచలనం సృష్టించాడు. మహారాష్ట్రలోని హేమంత్ బెంద్రే టెన్నిస్ అకాడమీలో కోచ్ ప్రసోంజిత్ పాల్ అండర్లో శిక్షణ పొందుతున్నాడు. అర్నవ్‌కు మహారాష్ట్ర స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్, మహాటెన్నిస్ ఫౌండేషన్ సపోర్ట్ అందిస్తున్నాయి.