July 8, 2026

Bank Account: బ్యాంక్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తున్నారా..? ఐటీ శాఖ నుంచి ఏ క్షణమైనా నోటీసులు..

Bank Account: బ్యాంక్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తున్నారా..? ఐటీ శాఖ నుంచి ఏ క్షణమైనా నోటీసులు..
Reading Time: 2 minutes
Bank Account: బ్యాంక్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తున్నారా..? ఐటీ శాఖ నుంచి ఏ క్షణమైనా నోటీసులు..

నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఎక్కువ దృష్టి పెడుతోంది. క్యాష్ పేమెంట్స్‌తో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, నెఫ్ట్, బ్యాంక్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్, బ్యాంక్ చెక్కుల రూపంలో చూసే లావాదేవీలను ఐటీ శాఖ పరిశీలిస్తూ ఉంటుంది. మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసినా, ఆదాయానికి మించి నగదు లావాదేవీలు చేసినా ఐటీ శాఖ నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు. ఐటీ శాఖ మీకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవొచ్చు. లావాదేవీలకు ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఆ పరిమితులకు దాటి మీరు ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే ఐటీ శాఖ మీపై దృష్టి పెడుతోంది. ఆ పరిమితులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఐటీ శాఖ కొత్త పరిమితులు

-సేవింగ్స్ అకౌంట్లలో ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా మీ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు పంపిస్తాయి. దీంతో ఐటీ శాఖ పాన్ కార్డు ద్వారా మీ ఆదాయాన్ని పరిశీలిస్తోంది. ఆదాయంతో మీ ట్రాన్సాక్షన్లు సరిపోలకపోతే ఐటీ శాఖ నిఘా ఉంచుతుంది. మీ లావాదేవీలను పరిశీలించి నోటీసులు పంపవచ్చు.

-ఇక బ్యాంకులో మీరు రూ.10 లక్షలకు మించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే ఐటీ శాఖ దృష్టికి వెళతారు. ఐటీ శాఖ మీ వివరాలను పరిశీలిస్తుంది.

-అలాగే బ్యాంక్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్లు, చెక్కులకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించి ట్రాన్సాక్షన్లు చేసినా ఐటీ శాఖ నిఘా ఉంచుతుంది.

-ఒక లావాదేవీలో రూ.2 లక్షలకు మించి గూడ్స్, సర్వీసెస్ క్యాష్ రిసిప్టులు తీసుకున్నా ఐటీ శాఖ ఫోకస్ పెడుతుంది

-రూ.లక్షకు మించి క్రెడిట్ కార్డు బిల్లు క్యాష్ రూపంలో చెల్లిస్తే ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు రావొచ్చు. అలాగే రూ.10 లక్షలకు మించి ఇరత రూపంలో బిల్లు చెల్లించినా ఐటీ శాఖ నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చు

-ఇక బాండ్లు, డిబెంచర్లలో రూ.10 లక్షలకు మించి పెట్టుబడితే పెడితే ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు

-ఒక ఒక ఏడాదిలో రూ.10 లక్షలకు మంచి షేర్లు కొన్నా ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు. ఇక రూ.10 లక్షలకు మించి షేర్ బైక్యాక్‌లో కొన్నా నోటీసులు వచ్చే అవకాశముంటుంది.

-మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.10 లక్షలకు మించి యూనిట్లు కొన్నా కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశముంటుంది.

-అలాగే ఇల్లు, భూముల లాంటి ఆస్తులకు సంబంధించి స్టాంప్ వాల్యూ రూ.30 లక్షలకు మించి కొనుగోలు చేసినా లేదా విదేశీ కరెన్సీ రూ.10 లక్షలకు మించి విక్రయించినా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుతాయి.