మొబైల్ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్

మోటారు బైక్‌కి హెడ్ లైట్ సరిగా లేకపోతేనే చీకట్లో బండి నడపడం ఎంతో కష్టం. అలాంటిది పదుల సంఖ్యలో ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సును హెడ్‌లైట్స్ లేకపోవడంతో సెల్‌ఫోన్ టార్చ్ లైట్ వెలుతురులో నడిపాడు డ్రైవర్. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. రాత్రి వేళ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు హెడ్‌లైట్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో, కండక్టర్ మొబైల్ ఫోన్ లో టార్చ్‌లైట్ వేసి దారి చూపించడంతో.. ప్రమాదకర స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ బస్సును నడిపాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు రాత్రి వేళ కలబురిగి నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చించోలి పట్టణానికి బయలుదేరింది. అది ఆ రోజుకు చివరి సర్వీసు కావడం, మార్గమధ్యంలో బస్సు హెడ్‌లైట్లు పూర్తిగా పనిచేయకపోవడంతో డ్రైవర్‌కు దారి కనిపించక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆ రోడ్డు మార్గమంతా దట్టమైన చీకటితో నిండి ఉండటంతో, కండక్టర్ తన మొబైల్ ఫోన్‌లోని టార్చ్ ఆన్ చేసి విండ్‌షీల్డ్ గుండా రోడ్డుపైకి వెలుతురు చూపించాడు. డ్రైవర్ కూడా ఆ కొద్దిపాటి మొబైల్ వెలుగులోనే బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సులోని ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించగా, వారిలో ఒకరు ఈ తతంగాన్ని అంతా తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు కర్ణాటక రవాణా శాఖపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కనీస ఫిట్‌నెస్, లైట్లు కూడా లేని బస్సులను రోడ్డెక్కించి ప్రయాణికుల ప్రాణాలతో ఎలా ఆటలాడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!
కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!
చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ.. దేని నుంచి తయారు చేస్తారో తెలిస్తే..