China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!

China: అంతరిక్ష చరిత్రలో చైనా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే తొలిసారిగా సముద్రంలో ప్రత్యేక వల ద్వారా అంతరిక్షం నుంచి వచ్చిన రాకెట్ తొలి దశ బూస్టర్‌ను ఒడిసిపట్టింది. ఈ ఘనత ద్వారా పునర్వినియోగ రాకెట్ బూస్టర్ సాంకేతికలో కొత్త అధ్యయానికి చైనా తెర తీసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (CASC) అభివృద్ధి చేసిన లాంగ్ మార్చ్-10Aను హైనాన్ కమర్షియల్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ప్రయోగం జరిగిన సుమారు ఆరు నిమిషాల తర్వాత రాకెట్ తొలి దశ, రెండో దశ నుంచి విడిపోయిన బూస్టర్లు నియంత్రిత పద్ధతిలో సముద్రంలో ఏర్పాటు చేసిన ఒక ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వలలో ల్యాండ్ అయింది. ఇలా ఒక రాకెట్ బూస్టర్ ల్యాండ్ కావడం ప్రపంచంలోనే తొలిసారి.
సాధారణంగా సముద్రంలో తేలియాడే వలపై రాకెట్‌ను ఖచ్చితంగా దించడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. గాలి వేగం, సముద్ర అలలు, రాకెట్ వేగం, దిశ వంటి అంశాలు రాకెట్ ల్యాంగింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. చాలా నియంత్రిత పద్ధతిలో రాకెట్‌ను దించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో చైనా విజయవంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అమెరికా, చైనా వద్ద మాత్రమే ఉంది.
ఈ ప్రయోగం ఎందుకు కీలకం.?
రాకెట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి కావాల్సిన శక్తిని రాకెట్ బూస్టర్లు అందిస్తాయి. రాకెట్ బూస్టర్ మండి లిఫ్ట్ ఫోర్స్‌ను అందిస్తాయి. ఇవి కొంత దూరం వెళ్లిన తర్వాత రాకెట్ నుంచి వేరవుతాయి. ఇలా వేరైన బూస్టర్లను పారేయకుండా, మళ్లీ ఉపయోగించేలా సేకరించగలిగితే, ప్రయోగాల ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇప్పటికే ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఇలా రాకెట్ బూస్టర్లను వినియోగించే టెక్నాలజీని కలిగి ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో చైనా కూడా చేరబోతోంది.
చంద్రుడి యాత్ర కోసం లాంగ్ మార్చ్ 10:
చైనా చంద్రుడిపై మానవుడిని దించే ప్లాన్‌లో ఉంది. దీని కోసం లాంగ్ మార్చ్ 10 రాకెట్లను డెవలప్ చేస్తోంది. ఈ రికవరీ టెక్నాలజీ విజయవంతం కావడంతో భవిష్యత్‌లో చంద్రయాత్రలు మరింత సులభంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
A historic day in China’s space program!
China’s Long March-10B has successfully completed its maiden flight—and recovered its first stage via a sea-based net. This marks the country’s first-ever controlled rocket recovery. A major leap toward reusable launch capabilities.… pic.twitter.com/FWuQXLltaD
— Mao Ning 毛宁 (@SpoxCHN_MaoNing) July 10, 2026