July 10, 2026

వర్షాకాలంలో ACని ఏ మోడ్‌లో వాడాలి? 99 శాతం మందికి తెలియదు

వర్షాకాలంలో ACని ఏ మోడ్‌లో వాడాలి? 99 శాతం మందికి తెలియదు
Reading Time: < 1 minute
వర్షాకాలంలో ACని ఏ మోడ్‌లో వాడాలి? 99 శాతం మందికి తెలియదు

వర్షాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో తేమ శాతం ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో ఇళ్లలో జిగటగా అనిపించడం, బూజు వాసన రావడం, గదులు తేమతో నిండిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలామంది వెంటనే ఏసీని కూల్ మోడ్‌లో ఆన్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ సీజన్‌లో డ్రై మోడ్ ఉపయోగించడం బెటర్. సాధారణంగా వర్షాకాలంలో ప్రధాన సమస్య అధిక ఉష్ణోగ్రత కాదు, గాలిలో ఉండే తేమ. గదిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి చెమట పట్టడం, జిగటగా అనిపించడం, బూజు వాసన రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రై మోడ్ గాలిలోని అదనపు తేమను తగ్గించి గదిని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

ఏసీలోని డ్రై మోడ్ ప్రత్యేకంగా తేమ అధికంగా ఉండే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ మోడ్‌లో కంప్రెసర్, ఫ్యాన్ నిరంతరం పనిచేయవు. అవసరాన్ని బట్టి మాత్రమే ఆన్, ఆఫ్ అవుతూ గాలిలోని తేమను తొలగిస్తాయి. దీంతో గది మరీ చల్లగా కాకుండా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. డ్రై మోడ్ ఉపయోగించడం వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం విద్యుత్ ఆదా. కంప్రెసర్ నిరంతరం పనిచేయకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గి కరెంట్ బిల్లు కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.

అలాగే రాత్రి సమయంలో డ్రై మోడ్ ఉపయోగిస్తే గదిలో తేమ తగ్గి నిద్ర మరింత ప్రశాంతంగా ఉంటుంది. గది మరీ చల్లబడకుండా ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు కూడా సౌకర్యంగా నిద్రపోగలరు. అధిక తేమ మనుషులకే కాకుండా ఇంట్లోని వస్తువులపై కూడా ప్రభావం చూపుతుంది. చెక్క ఫర్నిచర్, బట్టలు, పుస్తకాలు, గోడలు తేమ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. డ్రై మోడ్ గాలిలోని తేమను తగ్గించడం ద్వారా వీటిని కూడా కొంతవరకు రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి పరిస్థితిలో డ్రై మోడ్ అవసరం ఉండదు. బయట భారీ వర్షాలు కురుస్తూ, వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రై మోడ్ ఉత్తమ ఎంపిక. కానీ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు లేదా గదిని త్వరగా చల్లబరచాల్సిన అవసరం ఉన్నప్పుడు కూల్ మోడ్‌నే ఉపయోగించడం మంచిది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి