July 11, 2026

రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు

రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు
Reading Time: < 1 minute

రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు

Caption of Image.

మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టైన మృగం.. బెయిల్ పై బయటికొచ్చి అత్యంత క్రూర దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసు పెట్టారనే కసితో ఆరుగురిని చంపేశాడు దుర్మార్గుడు. శుక్రవారం (జులై 10) అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని దారుణంగా చంపాడు కిరాతకుడు. బెయిల్ పై బయటికి వచ్చిన కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి  తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో  మరో ముగ్గురిని హత్య చేశాడు.

 బాలికను వేధించినందుకు రాజ్‌కుమార్‌పై గతంలో పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్‌పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన  భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత  బాధిత బాలిక తల్లి, నాయనమ్మలను  హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు.

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో వెతుకుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.