July 8, 2026

ఇరాన్ పై తీవ్రంగా దాడి చేస్తాం : మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ఇరాన్ పై తీవ్రంగా దాడి చేస్తాం : మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
Reading Time: < 1 minute

ఇరాన్ పై తీవ్రంగా దాడి చేస్తాం : మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Caption of Image.

ఇరాన్, అమెరికా మధ్య సీజ్ ఫైర్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ ముగిసింది.. ఇక మిగిలింది దాడులే.. ఇరాన్ పై ఈ రాత్రికే భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు అంకారాలో జరిగిన  నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఈ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులు చేసి రెండు దేశాల మద్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. 

ఇరాన్ దాడులను మేం ఖండిస్తున్నాం. ఇరాన్ దాడులతో తాత్కాలిక ఒప్పందన్ని ఉల్లంఘించింది. అలా చేయడం ఇరానియన్ల తప్పు.. ఇరాన్ తో ఒప్పందంలో ముఖ్య అంశమే అణు కార్యక్రమాలు నిలిపివేయడం.. లేకపోతే ఆ పని మేమే చేస్తామమంటూ వార్నింగ్  హెచ్చరించారు. 

ఫిబ్రవరి చివరలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్  దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తత  వ్యూహాత్మక నౌకా రవాణా మార్గం హార్ముజ్ ఘర్షణలకు సెంటర్ పాయింట్ గా మిగిలిపోయింది.ఈ జలమార్గంపై నియంత్రణ కొనసాగించాలని టెహ్రాన్ పట్టుబడుతోంది. నౌకల రాకపోకలపై ఫీజులు వసూలు చేస్తామని లేకుంటే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇటీవల మూడు నౌకలపై దాడి చేయడంతో మంగళవారం ఇరాన్ పై అమెరికా దాడులుచేసింది. ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. 

©️ VIL Media Pvt Ltd.