Vijay: ‘జన నాయగన్’ రిలీజ్‌పై విజయ్ ఫుల్ ఫోకస్.. టికెట్ రేట్లపై కఠిన నిర్ణయం!

తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ( Jana Nayagan ) పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వివాదాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఆ సమస్యలను దాటుకుని త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులపైనే కాదు.. విడుదల సమయంలో ఎలాంటి వివాదాలు లేకుండా జరగాలన్న దానిపై విజయ్ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ‘జన నాయకన్’ విడుదల సమయంలో టికెట్ ధరలు అధికంగా వసూలు చేయడం, బ్లాక్ టికెట్ల విక్రయం, బెనిఫిట్ షోల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేయడం వంటి ఘటనలు అస్సలు జరగకూడదని విజయ్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
►ALSO READ | Toxic Tabaahi Song Out: కియారాతో యష్ ఇంటెన్స్ రొమాన్స్.. టాక్సిక్ ‘తబాహీ’ వీడియో సాంగ్ రిలీజ్!
ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున, సినిమా విడుదలకు సంబంధించిన ప్రతి అంశం రాజకీయంగా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. టికెట్ ధరల విషయంలో చిన్న వివాదం జరిగినా ప్రత్యర్థి పార్టీలు దానిని రాజకీయ ఆయుధంగా మార్చే అవకాశం ఉందనే అంచనాతో విజయ్ టీమ్ ముందుగానే అప్రమత్తమైనట్లు సమాచారం. అందుకే థియేటర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు విక్రయించాలని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు వెళ్లినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. అటు అభిమానులు కూడా ఈ ‘జన నాయకన్’ మూవీని ఎలాంటి వివాదాలు లేకుండా గ్రాండ్ రిలీజ్ చేయించి మరోసారి విజయ్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు.