July 8, 2026

ఎంత పని జేస్తివి బిడ్డా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిని కాటికి సాగనంపిన కూతురు !

ఎంత పని జేస్తివి బిడ్డా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిని కాటికి సాగనంపిన కూతురు !
Reading Time: 2 minutes

ఎంత పని జేస్తివి బిడ్డా.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్న తల్లిని కాటికి సాగనంపిన కూతురు !

Caption of Image.

గవర్నమెంట్ ఉద్యోగం కోసం, ఆస్తి కోసం కన్న కూతురే తల్లిని చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన అమానుష ఘటన రాజస్థాన్ జైపూర్లో జరిగింది. జైపూర్లోని ప్రతాప్ నగర్‌లోని రవీంద్ర నగర్‌లో ఉండే నీరజ్ శర్మ (45) అనే వివాహిత ఏడాది క్రితం తన భర్తను కోల్పోయారు. ఎనిమిది నెలల క్రితం, నీరజ్‌కు ఆమె భర్త స్థానంలో LDCగా ఉద్యోగం వచ్చింది. 

నీరజ్ కు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురికి పెళ్లై పోయింది. నీరజ్, ఆమె 16 ఏళ్ల కొడుకు మాత్రమే ఇంట్లో ఉంటారు. జూలై 3వ తేదీన.. సాయంత్రం సుమారు 4:45 గంటల సమయంలో ఆమె తన కొడుకును కోచింగ్‌ సెంటర్లో దగ్గర దిగబెట్టి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో.. అతివేగంతో వస్తున్న ఒక ఎక్స్‌యువి (XUV) ఆమెను ఢీ కొట్టింది. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన వెహికల్ ఢీ కొట్టడంతో ఆమె 100 అడుగుల దూరంలోకి ఎగిరిపడింది. తలకు రోడ్డు బలంగా తగలడంతో నీరజ్ శర్మ స్పాట్లోనే చనిపోయింది. ఢీ కొట్టేసి కనీసం తిరిగి చూడకుండా XUV డ్రైవర్ అక్కడ నుంచి వెహికల్తో పారిపోయాడు. పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తొలుత ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం కారణం అని అంతా భావించారు. కానీ.. కారుణ్య నియామకంలో భాగంగా వచ్చిన ఉద్యోగం కోసం తల్లితో కూతురు ఆయుషి గొడవ పడిన విషయం, ఆస్తి తగాదాలు గురించి నీరజ్ శర్మ సోదరుడు రాకేష్కు అప్పటికే తెలుసు. దీంతో.. ఆయుషినే తన తల్లి హత్యకు ప్లాన్ చేసి ఉంటుందనే అనుమానంతో రాకేష్ తన సోదరి మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు విచారించగా ఇది కారు ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. 

►ALSO READ | సమోసాలు కొనటానికి రైలును మధ్యలోనే ఆపాడా : వైరల్ వీడియోపై రైల్వేశాఖ ఏం చెబుతోంది..?

ఇక్కడ మరో దారుణమైన విషయం ఏంటంటే.. నీరజ్ శర్మ బావ (ఆమె భర్త అన్నయ్య) కూడా ఈ హత్యలో భాగస్తుడే కావడం గమనార్హం. నీరజ్ శర్మ కూతురు ఆయుషి, ఆయుషి భర్త, నీరజ్ శర్మ బావతో పాటు మరో నలుగురిని ఆమె హత్య కేసులో పోలీసులు నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. తల్లిని XUV ఢీ కొట్టి చంపేయమని.. నీరజ్ శర్మ కూతురు ఆయుషి 7 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

గత రెండు మూడు సంవత్సరాలుగా నీరజ్‌కు తన కూతురు ఆయుషితో ఆస్తి తగాదా ఉందని డీసీపీ (తూర్పు) రంజిత శర్మ తెలిపారు. ఆయుషి తన తండ్రి స్థానంలో ఉద్యోగం చేయాలనుకుంది, కానీ ఆమె తల్లి ఆ ఉద్యోగంలో చేరింది. ఈ పరిస్థితిలో, కూతురు తన తల్లిని చంపి ఉద్యోగం దక్కించుకోవాలని పథకం వేసింది. ఆయుషి, భరత్‌పూర్‌లోని సెవార్ నివాసి అయిన తన మేనమామ మోహన్ స్వరూప్ (56)తో కలిసి ఈ హత్యకు పథకం వేసింది. ఇందులో నీరజ్ అత్తమామలు కూడా పాలుపంచుకున్నారు.

ఆయుషి, మోహన్ ఈ హత్య కోసం 7 లక్షల రూపాయల కాంట్రాక్టు ఇచ్చారు. ఆయుషి, మోహన్, అతని కుమారుడు బలరామ్ అలియాస్ రవి కలిసి భరత్‌పూర్‌లోని బాయానా నివాసి అయిన కాంట్రాక్టు హంతకుడు హేమంత్ శర్మ (20)ను తమ ఇంటికి పిలిపించారు. వారు అతనితో, ‘నువ్వు నీరజ్ శర్మను చంపాలి, దానికి బదులుగా మేము నీకు 7 లక్షల రూపాయలు ఇస్తాము’ అని చెప్పారు. కాంట్రాక్టు తీసుకున్న తర్వాత, హేమంత్ బలరామ్ సహాయంతో రెక్కీ నిర్వహించాడు. అతను భరత్‌పూర్ నుంచి ఒక థార్‌ను అద్దెకు తీసుకున్నాడు. డబ్బు తీసుకున్న తర్వాత కూడా పని జరగకపోవడంతో, అతను ఒక నెల పాటు మళ్లీ రెక్కీ నిర్వహించి, ఒక XUVతో ఢీ కొట్టి నీరజ్ శర్మను చంపేశాడు.

©️ VIL Media Pvt Ltd.