Rashmika Mandanna: నేషనల్ క్రష్ రిస్కీ స్టంట్.. ‘మైసా’ కోసం రష్మిక అండర్ వాటర్ సాహసం..!

వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ ( Mysaa ). రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ ఈ మూవీ సెట్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అండర్ వాటర్ సాహసం..
ఈ సినిమాలో రష్మిక తన కెరీర్‌లోనే ముందెన్నడూ చూడని, అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తోంది. లేటెస్ట్ గాఈ సినిమా కోసం రష్మిక ఒక కఠినమైన, అత్యంత రిస్కీ అండర్ వాటర్ సీక్వెన్స్ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని టాక్. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట. స్క్రీన్‌పై ఈ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయని, థియేటర్లలో ఆడియన్స్‌కు ఇదొక ఐ-ఫీస్ట్ లాంటి హైలైట్ సీన్ కానుందని సినీవర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | 20 ఏళ్ల పచ్చని సంసారంలోకి సైకో యువతి ఎంట్రీ.. వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు ‘వదల’ట్రైలర్.!
భారీ రిలీజ్ ప్లాన్..
ప్రస్తుతం ఈ సినిమా ఆరో షెడ్యూల్ జరుపుకుంటూ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ ఫేమ్ జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు.
పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న మేకర్స్. షూటింగ్ పూర్తయిన వెంటనే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేయనున్నారు. ఈ క్రేజీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Makers of #RashmikaMandanna‘s #Mysaa have now completed filming an exciting underwater sequence featuring the actress! #RawindraPulle @unformulafilms pic.twitter.com/jFzFPgvWgM
— Cineobserver (@cineobserver) July 9, 2026