July 10, 2026

బీజేపీలోకి వెళ్లనని..మీ మామ మీద, ఆ రాముడి మీద ఒట్టెయ్..హరీశ్ కు రేవంత్ సవాల్

బీజేపీలోకి వెళ్లనని..మీ మామ మీద, ఆ రాముడి మీద  ఒట్టెయ్..హరీశ్ కు రేవంత్ సవాల్
Reading Time: < 1 minute

బీజేపీలోకి వెళ్లనని..మీ మామ మీద, ఆ రాముడి మీద ఒట్టెయ్..హరీశ్ కు రేవంత్ సవాల్

Caption of Image.

బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా హరీశ్ రావుపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు.. బీజేపీ నేతలతో రాత్రిపూట హరీశ్ రావు  మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. నిజంగా బీజేపీలోకి వెళ్లనని ఆ భద్రాచలం రాముడిపై, మీ మామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పగలవా?’ అని హరీశ్ కు సవాల్ విసిరారు . హరీశ్ రావు తాటి చెట్టంత పెరిగాడు కానీ, చింతకాయంత మెదడు కూడా లేదు అంటూ ఘాటుగా విమర్శించారు.

ఇక కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ.. సోంబేరి గాడు కేటీఆర్.. పగలు గబ్బు మాటలు, సాయంత్రం పబ్బులకే పరిమితం అని రేవంత్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ చేయిస్తున్న సర్వేలపైనా ఆయన సెటైర్లు వేశారు. పెళ్లికి బ్యాండ్ మేళం పిలుచుకుని, మనకు నచ్చింది వాయించమని చెప్పినట్లుగా ఉంది బీఆర్ఎస్ సర్వేలు అని ఎద్దేవా చేశారు.

ALSO READ : 2029 జూన్ లోనే అసెంబ్లీ ఎన్నికలు.. 117 సీట్లు గెలుస్తాం..

మేడిగడ్డ గేట్లు తెగితే రేపు భద్రాచలం రాముడు మునుగుతాడు అని ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్.. కేసీఆర్ బంధువుల దొంగ సర్వేలను, వారి కుట్రలను ఓడిస్తామని స్పష్టం చేశారు.  జరగబోయే ఈ రాజకీయ కురుక్షేత్రంలో ఖచ్చితంగా గెలుస్తాం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.