July 11, 2026

Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..

Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
Reading Time: < 1 minute
Ben Stokes Retirement Controversy Icc Rules Breach

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది.

ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో తన సహచర ఆటగాళ్లకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలిపాడు. ఈ భావోద్వేగ క్షణాలను ఇసిబి మీడియా టీమ్ వీడియో తీసింది. అయితే.. మ్యాచ్ ఇంకా నడుస్తుండగానే, టీ బ్రేక్‌కు ముందు ఆడియోతో కూడిన ఈ ఫుటేజీని బ్రాడ్‌కాస్టర్లకు, సోషల్ మీడియాకు విడుదల చేశారు.

నిబంధనల ఉల్లంఘన..
ఐసీసీ యాంటీ కరప్షన్ నిబంధనల ప్రకారం.. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమ్ డ్రెస్సింగ్ రూమ్ (PMOA) నుండి ఎలాంటి ఆడియో లేదా వీడియోలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం నిషేధం. బ్రాడ్‌కాస్టింగ్ ప్రయోజనాల కోసం డ్రెస్సింగ్ రూమ్‌లలో ఎలాంటి రికార్డింగ్ పరికరాలను ఉపయోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్ ముగిసే వరకు ఇలాంటి కంటెంట్‌ను దాచాలని ఐసీసీ గుర్తుచేసింది.

బెన్ స్టోక్స్ స్పందన..
మరోవైపు, తాను ఒత్తిడిలోనే రిటైర్ అయ్యాననే ఊహాగానాలపై బెన్ స్టోక్స్ స్పందించాడు. ఒక నివేదికను షేర్ చేస్తూ.. ‘దాన్ని పక్కన పడేయండి’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. ఇటువంటి నిరాధారమైన వాటిని నా దగ్గరకు రానివ్వొద్దని.. నిజాలు తెలియకుండా మాట్లాడొద్దని.. అటువంటి వారు ఉంటే బయటకు వెళ్లాలని ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

అద్భుతమైన కెరీర్..
గత 15 ఏళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్‌లో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల విజయంలో అద్భుత ప్రదర్శన చేశాడు. 2022లో టెస్ట్ కెప్టెన్ అయ్యాక ‘బాజ్‌బాల్’ శైలితో టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేశాడు. మైదానం వెలుపల మానసిక ఆరోగ్య సమస్యలు, 2018 బ్రిస్టల్ వివాదం వంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, అతను ఇంగ్లాండ్ మేటి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఈ వివాదంపై ఈసీబీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.