మీ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం పడావ్ పడింది: ఎమ్మెల్యే హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పడావ్ పడిందన్నారు పడిందన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాలనే అలోచన రేవంత్ రెడ్డి సర్కార్ కు లేదు..కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి నెగెటివ్ గా ఉన్నారు.. చెరువులు నింపుకునే అవకాశం ఉన్నా నింపడంలేదు.. నీళ్లు ఉన్నా ఎత్తి పోయలేకపోతున్నారన్నారు. దేవాదుల మోటార్లను పూర్తి స్థాయిలో నడపడం లేదని విమర్శించారు. తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయి.. అన్ని రాష్ట్రాలు ప్రతి చుక్కను ఒడిసి పడుతున్నాయి. మన రాష్ట్రం మాత్రం నీటిని కిందికి వదులుతోందని హరీష్ రావు ఆరోపించారు హరీష్ రావు.
ళేశ్వరంప్రాజెక్టు వ్యయం పెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ను 1800 కోట్లనుంచి4300 కోట్లకు పెంచారు.. అది పూర్తి అయ్యేవరకు ఇంకా ఎంతపెరుగుతోందో తెలియదు.. దేశంలో ఏ ప్రాజెక్టు అయినా అంచనాలు పెరగకుండా పూర్తి అయ్యాయని ప్రశ్నించారు హరీష్ రావు.
కాళేశ్వరం లేకుంటే మూసీకి నీళ్లు ఎక్కడినుంచి వచ్చేవని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో రెండేళ్ల లో సుంకిశాల కూలింది, పెద్దవాగుకొట్టుకుపోయింది. వట్టెం పంపు హౌజ్ మునిగిపోయిందని విమర్శించారు.గతంలో ఎన్నడు లేని విధంగా వరద వచ్చింది. 45 రోజుల్లోనే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఏజెన్సీ ద్వారా మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లందించామన్నారు.