July 11, 2026

Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే

Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Reading Time: < 1 minute
Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితోపోడిచి దారుణంగా హత్య చేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. మే 16వ తేదీన బాధితురాలి తల్లి కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో 28 సంవత్సరాల వయస్సున్న రాజ్‌ కుమార్‌ బెయిల్‌పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక, తల్లి, నానమ్మ, పిల్లలను పొడిచి చంపాడు. జిల్లాలోని షాబాద్‌ మండలం దైవాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌లు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.