Kriti Sanon: బాలీవుడ్‌లో జెండర్ బయాస్‌పై కృతి సనన్ ఫైర్

బాలీవుడ్‌లో జెండర్ బయాస్, రెమ్యునరేషన్ల విషయంలో హీరోయిన్ల కంప్లయింట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ కృతి సనన్ కూడా చేరిపోయారు. క్యారవాన్స్ దగ్గరి నుంచి సెట్స్‌లో ఇచ్చే రెస్పెక్ట్ వరకు కృతి చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ కృతి సనన్ ఏమన్నారు? నటిగా నేషనల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న కృతి సనన్, బాలీవుడ్లో ఉన్న జెండర్ బయాస్ గురించి సెన్సేషన్ కామెంట్స్ చేశారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తాను స్వయంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓపెన్ అయ్యారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా బాలీవుడ్ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, మేల్ యాక్టర్స్‌తో పోలిస్తే హీరోయిన్లను చూసే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు కృతి. గతంతో పోలిస్తే ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, బలమైన పాత్రలు వస్తున్నా.. సెట్స్‌లో మాత్రం ఆ వివక్ష ఇంకా అలాగే కొనసాగుతుందన్నారు. షూటింగ్ స్పాట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్, క్రూ మెంబర్స్ హీరోల చుట్టూ చాలా జాగ్రత్తగా, గౌరవంగా ఉంటారని, కానీ హీరోయిన్ల విషయానికి వస్తే మాత్రం వాళ్లను లైట్ తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చిన్న క్యారవాన్ ఇచ్చినా, చిన్న కారు ఇచ్చినా తాను పెద్దగా పట్టించుకోనని, కానీ ట్రీట్‌మెంట్ విషయంలో తక్కువ చేసి చూపిస్తే మాత్రం చాలా బాధగా ఉంటుందని చెప్పారు. ఫెసిలిటీస్ కన్నా గౌరవమే ముఖ్యమన్నారు. వివాదాలకు దూరంగా ఉంటే కృతి ఇలాంటి కామెంట్స్ చేయటం బాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త డిస్కషన్‌కు తెర తీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..