Reading Time: < 1 minute
Amarnath Yatra 2026 Ice Shivling Melts Completely In 5 Days Reasons

Amarnath Yatra: హిందూ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమర్నాథ్ క్షేత్ర యాత్ర ఈ నెల 3వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగాల్సిన ఈ యాత్ర మొదలైన ఐదు రోజులకే ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు భక్తులందరిని షాక్‌కు గురి చేసింది. ఈ యాత్ర ప్రారంభం నాటికి పవిత్ర గుహలో దాదాపు 5 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చిన మంచు శివలింగం, ఇప్పుడు పూర్తిగా అంతర్థానమైంది.

బాబా బర్ఫానీ (మంచు శివలింగం) ఇంత త్వరగా కరిగిపోవడానికి ప్రధాన కారణం భక్తుల భారీ రద్దీ, పర్యావరణ ప్రభావాలేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 4 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాత్ర ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 86 వేల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం వల్ల గుహ పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. దీనికి తోడు గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా మంచు లింగం ఐదు రోజుల్లోనే కరిగిపోయింది. అయితే శివలింగం కరిగిపోయినప్పటికీ, పవిత్ర గుహ దర్శనం కోసం భక్తుల రిజిస్ట్రేషన్లు, యాత్ర యథావిధిగా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.