July 10, 2026

బీఎల్ఓలకు సర్ ఫారాలపై అవగాహన లేదు.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం

బీఎల్ఓలకు సర్ ఫారాలపై అవగాహన లేదు.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం
Reading Time: < 1 minute

బీఎల్ఓలకు సర్ ఫారాలపై అవగాహన లేదు.. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం

Caption of Image.

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాజకీయ పార్టీల సమన్వయ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎదురవుతున్న క్షేత్రస్థాయి సమస్యలను పలువురు ప్రతినిధులు లేవనెత్తారు. 

కొందరు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండా ఒకేచోట కూర్చుని ఫారాలు ఇస్తున్నారని, సాధారణ ఓటర్లకే కాక కొందరు బీఎల్‌ఓలకు కూడా ఫారాలు ఎలా నింపాలో స్పష్టమైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని లీడర్లు తెలిపారు. దీనిపై  కలెక్టర్ మాట్లాడుతూ పనితీరు మందగించిన బీఎల్‌ఓలను పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లు, ఆర్‌పీలను ఆదేశించామన్నారు.

©️ VIL Media Pvt Ltd.