July 9, 2026

జ్యోతిష్యం: యోగిని ఏకాదశి స్పెషల్.. జులై 10న తొమ్మిది పరిహారాలు.. జీవితాన్నే మార్చేస్తాయి..!

జ్యోతిష్యం:  యోగిని ఏకాదశి స్పెషల్.. జులై 10న తొమ్మిది పరిహారాలు.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Reading Time: 3 minutes

జ్యోతిష్యం: యోగిని ఏకాదశి స్పెషల్.. జులై 10న తొమ్మిది పరిహారాలు.. జీవితాన్నే మార్చేస్తాయి..!

Caption of Image.

ప్రతి జబ్బుకు మందు ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.  సమస్యలు లేని వారు ఉండరు.  ఏదో ఒక సమయంలో ఇబ్బందులు పడుతుంటారు ఇది మానవ జీవితం.  జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. యోగిని ఏకాదశి రోజున ( జులై 10) కొన్ని పరిహారాలు చేస్తే ఆరోగ్య సమస్యలు.. ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు పరిష్కారమయి.. జీవితమే మారిపోతుందని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది.  జ్యేష్ఠమాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏడాది( 2026)  జులై 10న వచ్చింది. ఆ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా పూజించి.. కొన్ని పరిహారాలు చేయడం  వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని, జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని.. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు తొలగిపోతాయని  పురాణాల ద్వారా తెలుస్తుంది. 

1. దానం.. ధర్మం: ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం అక్షయమైన ఫలితం ఉంటుంది.  అక్షయం అంటే తరగనది అని అర్దం. ఆరోజున ఏవస్తువులు దానం చేస్తారో అవి మీ ఇంట్లో ఎప్పటికి ఉంటాయని పండితులు చెబుతున్నారు.  అందుకే ఏకాదశి రోజున అన్నదానం.. వస్త్రదానం చేయడం చేయడం చాలా పుణ్యం లభిస్తుంది. 

2. లక్ష్మీనారాయణుల అర్చన:  తులసి మొక్కను.. విష్ణుమూర్తిని ఏకాదశి రోజున పూజించడం వలన భార్యభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు .. మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. మహాలక్ష్మి దేవికి అంటే తులసి చెట్టుకు పసుపు.. కుంకుమ.. గంధం.. గాజులు సమర్పించండి.  ఒక ముత్తైదువును పిలిచి కాళ్లు కడిగి.. పారాయణం పెట్టి.. వస్త్రాలు ఇచ్చి.. పాద పూజ చేయాలి.  ఆ తరువాత భోజం పెట్టాలి. కాని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను పాటిస్తారు కనుక స్వయం పాకం ఇవ్వాలి. దక్షిణ తాంబూలం ఇచ్చి మహాలక్ష్మి స్వరూపంగా పూజ చేశాం కాబట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి.  

3. ఉద్యోగ సమస్యలు:  వృత్తి.. ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తున్నవారు జులై 10 శుక్రవారం ( యోగిని ఏకాదశి ) రోజున విష్ణుమూర్తని పంచామృతాలతో     అభిషేకం చేయాలి.  ఆ తరువాత పసుపు రంగు వస్త్రాలను స్వామి వారికి సమర్పించి.. తులసిదళాలతో పూజించాలి. పూలమాలలతో అలంకరించాలి.  ఆ తరువాత పసుపు రంగుపండ్లను స్వామివారికి నివేదించాలి.  పేదవారికి .. బ్రాహ్మణులకు ధన సహాయం చేయాలి.  ఇలా చేయడం వలన కెరీర్​ లో వస్తున్న ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

4. ఆరోగ్య సమస్యలు:  దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు జులై 10( యోగిని ఏకాదశి రోజున) ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి.  నిరుపేదలకు కావలసిన వస్తువులు ఇవ్వాలి.  గోమాతకు తోటకూర… బెల్లం.. నువ్వులు ఆహారంగా ఇవ్వాలి. శివాలయంలో దీపారాధనకు శక్తి కొలది నువ్వులనూనె ఇవ్వాలి.  ఇలా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | ఆధ్యాత్మికం.. జులై 10 చాలా విశిష్టమైన రోజు.. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలకు చెక్..!

5. భాగవతం పారాయణం:  ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ ఇంటిలో నివసించే వారి సుఖ సంతోషాలు ఉండవు. ఆ ఇంట్లో పాజిటివ్​ శక్తి తాండవించాలి.  అలా జరగాలంటే భాగవతం.. రామాయణం.. వంటి మహా గ్రంధాలను పారాయణం చేయాలి. లేదా వినాలి.  సుందరాకాండ పారాయణం..హనుమాన్​ చాలీసా చదవడం వలన కూడా పాజిటివ్​ శక్తి ఇంట్లోకి చేరి సమస్యలు పరిష్కారమవుతాయని  పండితులు చెబుతున్నారు. 

6. ఆర్థిక సమస్యలు: ఎంత సంపాదించినా చిల్లిగవ్వ కూడా చేతిలో ఉండకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే యోగిని ఏకాదశి రోజున( జులై10) పవిత్రమైన రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.  తరువాత ఆ చెట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు ఇంట్లో సంపద నిలుస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

7.రోజూ పూజ చేయడం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి  విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజించాలి.  ఇలా చేయడం వలన దైవబలం లభిస్తుంది.  అనుకోకుండా వచ్చే ఇబ్బందులు తొలగుతాయి. 

8. బ్యాంక్​ బ్యాలెన్స్​ వృద్ది:  ధనయోగం లేకపోతే బ్యాంక్​ బ్యాలెన్స్​ ఉండదు.  ఒక తమలపాకుపై పసుపు చందనంతో ‘ఓం విష్ణవే నమః’ అని రాసి, విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచండి. మరుసటి రోజు ఆ ఆకును ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువా లేదా ధన స్థానంలో దాచుకుంటే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

9. ప్రశాంతత కోసం: ఇల్లు కలహాలతో సతమతమవుతుంటే, యోగిని ఏకాదశి  రోజున విష్ణు సహస్రనామం పఠించండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూలతలను తొలగించి శాంతిని నెలకొల్పుతుంది.

యోగిని ఏకాదశి వ్రతం చేయడం వలన గత జన్మల పాపాల వలన విముక్తి లభిస్తుంది. జీవితంలో కలిగే ఇబ్బందులు పరిష్కారమవుతాయి.  అంతేకాకుండా జాతక దోషాలు తొలగికి ఆరోగ్యం, సంపద, సంతోషం కలుగుతాయనిపండితులు చెబుతున్నారు. అయి తే ఈ వ్రతాన్ని భక్తితో నియమ నిష్ఠలతో ఆచరించాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.