July 9, 2026

IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!

IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
Reading Time: 2 minutes
Redmi Note 17 Pro Launch On July 14 Ip69k Rating 9000mah Battery 1 5k Oled Display

కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ REDMI Note 17 Proకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో జూలై 14న విడుదల చేయనుంది. భారీ బ్యాటరీ, అత్యంత బలమైన బాడీ, అధునాతన డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఎక్కువ కాలం ఉపయోగించుకునేలా డిజైన్ చేయడంపై షావోమీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

REDMI Note 17 Proలో కొత్త స్కై బ్లూ (Sky Blue) కలర్ ఆప్షన్‌ను అందిస్తున్నారు. లైట్ బ్లూ గ్రేడియెంట్ ఫినిష్, మ్యాట్ టెక్స్చర్‌తో ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇచ్చారు. ఉదయం ఆకాశంలోని మేఘాల నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంకా ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇవ్వడం విశేషం. కంపెనీ ప్రకారం, ఈ డివైస్ 3 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా రూపొందించారు. అలాగే SGS, CQC సంస్థల నుంచి డ్యూయల్ ఫైవ్ స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. నీటి నిరోధకత విషయంలో కూడా ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ లభించాయి. అంతేకాకుండా 2 మీటర్ల లోతు నీటిలో 72 గంటల పాటు పనిచేసే సామర్థ్యానికి TÜV SÜD సర్టిఫికేషన్ కూడా పొందినట్లు షావోమీ తెలిపింది.

భారీ బ్యాటరీ:

REDMI Note 17 Proలో ప్రధాన ఆకర్షణ 9,000mAh భారీ బ్యాటరీ. దీనికి 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 22.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. దీంతో ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్‌తో షావోమీ ప్రత్యేక బ్యాటరీ గ్యారంటీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. మొదటి నాలుగేళ్లలో బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తగ్గితే ఉచితంగా కొత్త బ్యాటరీని అందిస్తారు. ఐదో ఏడాదిలో బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తగ్గితే మరింత పెద్ద సామర్థ్యం ఉన్న బ్యాటరీతో ఉచితంగా అప్‌గ్రేడ్ చేసే అవకాశం కల్పిస్తామని కంపెనీ తెలిపింది.

OLED డిస్‌ప్లే:

REDMI Note 17 Proలో 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ స్క్రీన్ గరిష్టంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించగలదు. దీంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తక్కువ వెలుతురు ఉన్న సమయంలో కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ మౌంటైన్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. అవసరమైతే స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను కేవలం 1 నిట్ వరకు తగ్గించే సదుపాయం ఇందులో ఉంది.

ప్రస్తుతం ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లను మాత్రమే వెల్లడయ్యాయి. కెమెరా, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, ధర వంటి పూర్తి వివరాలు జూలై 14న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, బలమైన బిల్డ్ క్వాలిటీ, ప్రీమియం డిస్‌ప్లేతో REDMI Note 17 Pro మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.