July 9, 2026

ముసలోడే అయినా కంత్రీగాడు.. చార్లెస్ శోభరాజ్ ఆదర్శంగా 36 ఏళ్లుగా మోసం చేస్తూ.. చివరికి..

ముసలోడే అయినా కంత్రీగాడు.. చార్లెస్ శోభరాజ్ ఆదర్శంగా 36 ఏళ్లుగా మోసం చేస్తూ.. చివరికి..
Reading Time: 2 minutes

ముసలోడే అయినా కంత్రీగాడు.. చార్లెస్ శోభరాజ్ ఆదర్శంగా 36 ఏళ్లుగా మోసం చేస్తూ.. చివరికి..

Caption of Image.

అతని వయస్సు 69 సంవత్సరాలు.. ఇంట్లో రెస్ట్ తీసుకునే వయస్సు.. పార్కుల్లో కాలక్షేపం చేసే వయస్సు.. వీడు మాత్రం కంత్రీగాడు.. 39 ఏళ్లుగా.. 10 రాష్ట్రాల్లో.. ఫైవ్ స్టార్ హోటళ్లల్లో దర్జాగా విలాసవంతంగా ఎంజాయ్ చేస్తూ.. బిల్లులు కట్టకుండా తప్పించుకుని తిరుగుతూ.. 69 ఏళ్ల వయస్సులో ఎట్టకేలకు దొరికిన బింగ్సన్ జాన్ తెలివితేటలకు ఇప్పుడు పోలీసులే నోరెళ్లబెడుతున్నాడు. చార్లెస్ శోభరాజ్ ఆదర్శంగా 39 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తున్న జాన్ కథ ఎంత ఆసక్తిగా ఉందో తెలుసుకుందామా..

మూడున్నర దశాబ్దాలుగా విలాసవంతమైన ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేస్తూ, బిల్లులు చెల్లించకుండా మాయమవుతున్న వ్యక్తి  బింగ్సన్ జాన్ చివరకు పోలీసులకు చిక్కాడు. 69 ఏళ్ల బింగ్సన్ జాన్ కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతను చేసిన మోసాల కంటే, వాటికి ప్రేరణగా నిలిచింది ప్రపంచ ప్రఖ్యాత నేరస్థుడు చార్లెస్ సోభ్రాజ్ అని పోలీసుల ఎదుట ఒప్పుకోవడం మరింత సంచలనంగా మారింది.

తమిళనాడుకు చెందిన బింగ్సన్ జాన్ 1990 నుంచి దేశంలోని 10కి పైగా రాష్ట్రాల్లో సుమారు 300 హోటళ్లలో బస చేసి మోసాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. హోటల్ సిబ్బందిని నమ్మించేలా విదేశీ టూర్ గైడ్‌గా, ఇంగ్లీష్ టీచర్‌గా, యోగా శిక్షకుడిగా పరిచయం చేసుకుని, కొన్ని రోజుల పాటు విలాసవంతమైన గదుల్లో బస చేసేవాడు. ఆ తర్వాత బిల్లు చెల్లించకుండా అక్కడి నుంచి అదృశ్యమయ్యేవాడు.

జూన్ 27న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రెండు రోజులు బస చేసిన జాన్.. రూ.63వేల755 బిల్లు చెల్లించకుండా వెళ్లిపోయాడు. అంతేకాకుండా, తనకు అత్యవసర ఆఫీస్ పని ఉందని చెప్పి హోటల్ ద్వారా తెప్పించిన రూ.1.48 లక్షల విలువైన రెంటెడ్ ల్యాప్‌టాప్‌ తో పరారయ్యాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగి టెక్నికల్ క్లూస్ ద్వారా కేవలం 72 గంటల్లో జాన్ ను పట్టుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో అతడిని అరెస్టు చేశారు.

విచారణలో జాన్ చెప్పిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రపంచవ్యాప్తంగా  బికినీ కిల్లర్ గా కుప్రసిద్ధి చెందిన చార్లెస్ సోభ్రాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తాను ఈ మార్గంలో నడిచానని చెప్పడం, సోభ్రాజ్ మాదిరిగానే ఫేక్ ఐడెంటిటీ కార్డులతో విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఈ మోసాలకు పాల్పడినట్లు జాన్ చెప్పడంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. 

1996లో తొలిసారి ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లిన జాన్, అప్పటి నుంచి దేశంలోని వివిధ జైళ్లలో దాదాపు 15 ఏళ్లు గడిపినా బుద్ది మార్చుకోలేదు.  జైలు నుంచి విడుదలైన ప్రతిసారీ మళ్లీ అదే పద్ధతిలో హోటళ్లను మోసం చేస్తూ వచ్చాడు. విచారణలో అతడు చెప్పిన ఒక మాట పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. “జైలు నా హోమ్‌స్టే… ఫైవ్‌స్టార్ హోటళ్లు నా టూరిస్ట్ స్పాట్స్. నాకు తినాలంటే జైలులో లేదా ఫైవ్‌స్టార్ హోటల్‌లోనే తినడం ఇష్టం” అని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మూడు దశాబ్దాల పాటు తెలివిగా తప్పించుకున్న ఈ మోసగాడి కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

©️ VIL Media Pvt Ltd.