July 10, 2026

Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..

Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
Reading Time: < 1 minute
Trump Says Iran Wants Talks But Declares Us Iran Ceasefire Is Over

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ చర్చలపై కీలక ప్రకటన చేశారు. అమెరికాతో చర్చలను ఇరాన్ కోరిందని, అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ముగిసిపోయిందని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని ‘చర్చలు’ కొనసాగించమని కోరింది. మేము అలా చేయడానికి అంగీకరించాము, కానీ కాల్పుల విరమణ ముగిసిందని యునైటెడ్ స్టేట్స్ వారికి స్పష్టంగా చెప్పింది’’ అని పోస్ట్ చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింటి. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

హోర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడంతో ఈ తాజా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దాడులకు ఇరాన్ వైఖరే కారణమని అమెరికా ఆరోపించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రైయిన్‌లపై దాడలు చేస్తోంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా రైల్వే కారిడార్, చాబహార్ పోర్టులతో పాటు పలు ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది.