Reading Time: < 1 minute

కాళేశ్వరంపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే : చనగాని దయాకర్

Caption of Image.
  •     పీసీసీ ప్రధాన కార్యదర్శి  చనగాని దయాకర్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ డిమాండ్ చేశారు. గురువారం గాంధీ భవన్‌‌‌‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై హరీశ్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికి పనికిరాదని, పైగా ఎన్‌‌‌‌డీఎస్ఏ అధికారులు, ఇంజనీర్ల కంటే తనే ఎక్కువ తెలివైనవాడిననే పద్ధతిలో హరీశ్ రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్కా నీటిని తీసుకోకుండానే వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గుర్తుంచుకోవాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.