ఈ సమస్యలు ఉన్నవాళ్లు వర్షాకాలంలో ఏ మాంసం తినొద్దు.. తింటే, బండి షెడ్డుకి వెళ్లడం ఖాయం
చాలా మందికి ఒక సందేహం ఉంది. వర్షాకాలంలో మాంసం తినొచ్చా? ఒక వేళ తింటే , ఏది తినాలి? అని. అయితే, ఈ కాలంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా చికెన్, మటన్ రెండూ కూడా మంచి ఫుడ్ యే కానీ, జీర్ణమవ్వడానికి చాలా టైం టైమ్ పడుతుంది. వానల్లో ఎలాంటి ఫుడ్ ఆరోగ్యానికి మంచిదో చూద్దాం..
వర్షాకాలంలో ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. అయితే, మీరు ఏ మాంసం కూరలు తీసుకున్నా కూడా
బాగా ఉడికించిన మాత్రమే తినాలి. ఇంకా కొద్దీ కొద్దిగా ఉడికిన మాంసం కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువసేపు బయట పెట్టిన మాంసం తింటే ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.
చికెన్ తింటే తక్కువ సమయంలోనే జీర్ణమవుతుంది కానీ, శరీరంలో వేడి సమస్యలతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇంకా దీనిలో కోడి స్కిన్ మంచి ఎంపికగా చెబుతారు. ఇంకా ఇది కండరాల బలానికి కూడా హెల్ప్ చేస్తుంది. మటన్‌తో పోలిస్తే దీనిని ఎక్కువగా తింటారు.
మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఐరన్, జింక్, విటమిన్ B12 ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అయితే చికెన్‌తో పోలిస్తే దీనిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మోతాదులో మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మరి దీనిలో ఏది మంచిది?
శరీరానికి బలం తినే ఫుడ్ వలెనే వస్తుంది. ఏది తిన్నా పడని వాళ్లు ఈ రెండింటిని దూరం పెడితేనే మంచిది. నిజం చెప్పాలంటే ఈ శరీరానికి ఈ రెండూ అవసరమైన ప్రోటీన్‌ను ఇస్తాయి. ఎక్కువ ప్రోటీన్ తినాలి అనుకుంటే చికెన్ మంచిది. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు మోతాదులో మటన్ తీసుకోవడంమంచిది.




