July 10, 2026

Prabhas: రిలీజ్‌కు ముందే ప్రభాస్ ‘ఫౌజీ’ రికార్డుల వేట.. నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్.. సగానికి పైగా బడ్జెట్ రికవరీ!

Prabhas: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ' రికార్డుల వేట.. నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్.. సగానికి పైగా బడ్జెట్ రికవరీ!
Reading Time: 2 minutes

Prabhas: రిలీజ్‌కు ముందే ప్రభాస్ ‘ఫౌజీ’ రికార్డుల వేట.. నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్.. సగానికి పైగా బడ్జెట్ రికవరీ!

Caption of Image.

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేడు. ఈ డార్లింగ్ చిత్రం అనౌన్స్ అయిందంటే చాలు.. ట్రేడ్ వర్గాల్లో లెక్కలన్నీ మారిపోతాయి. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా  ‘ఫౌజీ’ . సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్  ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ ముందే రికార్డులు..

అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, థియేట్రికల్ హక్కులపూ భారీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.180 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే హిందీ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ రూ.60 కోట్లకు పైగా సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా సుమారు రూ.240 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

►ALSO READ | Samantha : అఖిల్ కు సమంత స్పెషల్ విషెస్.. ‘లెనిన్’కు బ్లాక్ బస్టర్ సంకేతాలంటూ పోస్ట్..!

బడ్జెట్ లో సగానికి పైగా రికవరీ..

ఇంకా హిందీ ఓటీటీ హక్కులు, శాటిలైట్, ఆడియో, విదేశీ పంపిణీ, ఇతర అనుబంధ హక్కులు విక్రయించాల్సింది. దీంతో ఈ మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ మరింత భారీ స్థాయికి చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ కారణంగా ఈ డీల్స్‌పై కొనుగోలుదారులు తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ పోటీ చూస్తుంటే ఈ మూవీ రిలీజ్ కు ముందే సగానికి పైగా బడ్జెట్ ను రికవరీ చేసేలా ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే అధికారికంగా ఈ బిజినెస్ డీల్స్‌పై ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఇవే హాట్ టాపిక్‌గా మారాయి.

భారీ అంచనాలతో.. 

ఇదిలా ఉండగా, జులై 10 నుంచి సినిమా కీలకమైన హై-ఆక్టేన్ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొననున్నారు. ఈ చిత్రంలో నూతన నటి ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె. ఆచార్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తుండగా.. ఇప్పటికే ‘ఫౌజీ’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి..

 

©️ VIL Media Pvt Ltd.