July 9, 2026

Bigg Boss Telugu 10: గత మూడు సీజన్లుగా ‘బిగ్‌బాస్’ నుంచి కాల్స్.. ఈసారి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్ వచ్చింది

Bigg Boss Telugu 10: గత మూడు సీజన్లుగా ‘బిగ్‌బాస్’ నుంచి కాల్స్.. ఈసారి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్ వచ్చింది
Reading Time: 2 minutes
Bigg Boss Telugu 10: గత మూడు సీజన్లుగా ‘బిగ్‌బాస్’ నుంచి కాల్స్.. ఈసారి కూడా భారీ రెమ్యునరేషన్ తో ఆఫర్ వచ్చింది

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం ముస్తాబవుతోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు దిద్దనున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల నిర్వహణలో విషయంలో సరికొత్త పద్ధతులను అవలంబించనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఆడిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కానుంది. మరోవైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పలువురి సెలబ్రిటీల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ అలియాస్ నందు, రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ, వర్ష, పవిత్ర, వర్షిణీ.. ఇలా చాలా మంది హౌస్ లోకి రావచ్చునని తెలుస్తోంది. అయితే గత కొన్నేళ్లుగా ఒక జబర్దస్త్ బ్యూటీకి బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయట. కానీ ఆమె మాత్రం నో అని చెబుతూనే ఉందట. ఈసారి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను సంప్రదించారట. అది కూడా భారీ రెమ్యునరేషన్ తో.. కానీ ఈసారి కూడా ఆమె నో చెప్పింది. ఆమె మరెవరో కాదు సత్యశ్రీ.

వెంకట్రామయ్య మనవరాలు సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది సత్యశ్రీ. ఈ సందర్భంగా యాంకర్ ‘బిగ్ బాస్’ పై మీ ఒపీనియన్ ఏంటి? అని అడిగాడు.. దీనికి ఆమె నవ్వుతూ.. ‘ బిగ్ బాస్ ఒక మంచి షో’ అని సమాధానం ఇచ్చింది. ఇక గత మూడు సీజన్లుగా సత్యశ్రీకి బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్స్ వస్తునే ఉన్నాయి. ఈ సీజన్ కోసం కూడా ఆమెకు కాల్ వచ్చింది. అది కూడా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తో.. కానీ ఈ షోకు వెళ్లడం పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదంటోంది సత్యశ్రీ. ‘ ఇప్పుడు నాకు నా ఫ్యామిలీ మెయిన్. అమ్మా, నాన్న.. ఈ సినిమా (వెంకట్రామయ్య గారి మనవరాలు) కూడా నాకు బాగా రిలేటెడ్ అవుతుంది. మమ్మీ, డాడీ మా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వారు హ్యాపీగా కాలు మీద కాలేసుకుని ఉండాలనుకుంటున్నాను. వారిని మేమే చూసుకుంటున్నాం. మా సిస్టర్ కూడా జాబ్ చేస్తోంది’

జబర్దస్త్ సత్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Satya Sri (@me_satyasri)

‘అమ్మానాన్నల కోసం సొంతంగా ఒక ఇళ్లు కట్టించా.. అది కూడా హైదరాబాద్ లో కాదు.. మా సొంతూరులో. మేం పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వాళ్లకంటూ ఒక ఇళ్లు, ఆధారమనే ది ఉండాలి. ది ఎండ్ వరకు వాళ్లు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు నేను బిగ్ బాస్ కు వెళ్లాలంటే మా పేరెంట్స్ ను వదులుకుని వెళ్లాలి. చాలా మంది ఫ్యామిలీస్ వదిలేసి వస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.. బట్.. నా విషయానికి వస్తే.. మా అమ్మానాన్నల బాధ్యతలను చూసే కేపబిలిటీ మా సిస్టర్ కు లేదు. ఇంట్లో నేనే పెద్దదాన్ని. వాళ్లను అలా వదిలేసి వెళ్లడం నాకు కష్టంగా అనిపిస్తోంది. అందుకే చాలా ఏళ్లుగా బిగ్ బాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి.. కానీ నేను వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది సత్యశ్రీ. ప్రస్తుతం ఈ జబర్దస్త్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Satya Sri (@me_satyasri)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి