అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతున్నాయా? ఈ 4 అలవాట్లను వెంటనే మార్చుకోండి!
మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలలో చంకలు ఒకటి. ఇక్కడి చర్మం పలుచగా ఉంటుంది. కాబట్టి, ఏ మాత్రం రాపిడి, రసాయనాలు, లేదా పదేపదే కలిగే చికాకు అయినా దాని ప్రభావాలను త్వరగా చూపిస్తాయి. చాలా మంది ముఖం, చేతుల సంరక్షణపై చూపించే శ్రద్ధ చంకల పై చూపించరు. ఫలితంగా ఆ భాగం నల్లగా మారి, నచ్చిన దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడుతుంటారు. చంకలు నల్లబడటానికి కేవలం జన్యుపరమైన కారణాలే కాదు, మనం చేసే కొన్ని రోజువారీ తప్పులు కూడా కారణమవుతాయి. నల్లటి చంకలను తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. కానీ, అసలు కారణాన్ని గుర్తించకపోతే, ఈ సమస్య మళ్లీ మళ్లీ రావచ్చు. అందువల్ల, చంకలు ఎందుకు నల్లబడతాయో ముందుగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
రేజర్లతో షేవింగ్ చేయడం: చాలామంది చంకల్లోని అన్వాంటెడ్ హెయిర్ తొలగించడానికి సులభమైన పద్ధతిగా షేవింగ్‌ను ఎంచుకుంటారు. కానీ, తరచూ రేజర్లను ఉపయోగించడం వల్ల చర్మంపై ఘర్షణ జరిగి, ఆ భాగం క్రమంగా నల్లగా మారుతుంది. అంతేకాకుండా, షేవింగ్ వల్ల జుట్టు కేవలం పైపైనే కట్ అవుతుంది. కానీ, లోపలి రూట్స్ అలాగే ఉండిపోవడం వల్ల కూడా ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది.
కెమికల్ డియోడరెంట్లు, పర్ఫ్యూమ్ల వాడకం: చెమట వాసన రాకుండా ఉండటానికి మనం ఉపయోగించే డియోడరెంట్లు, పర్ఫ్యూమ్లలో ఆల్కహాల్, స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటాయి. వీటిని నేరుగా చర్మంపై స్ప్రే చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తలెత్తి చర్మం రంగు మారుతుంది.
బిగుతైన దుస్తులు: మరీ టైట్‌గా ఉండే దుస్తులను ధరించడం వల్ల చంకల భాగంలో చర్మానికి, బట్టలకు మధ్య రాపిడి ఎక్కువవుతుంది. దీనివల్ల చర్మంపై మంట, దురద ఏర్పడి కాలక్రమేణా ఆ ప్రాంతం నల్లబడుతుంది. ముఖ్యంగా సింథటిక్ దుస్తుల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.
మృతకణాలు పేరుకుపోవడం: శరీరంలోని మిగతా భాగాలలాగే చంకల్లో కూడా మృతకణాలు పేరుకుపోతుంటాయి. ఆ భాగాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోవడం లేదా స్క్రబ్ చేయకపోవడం వల్ల డెడ్ స్కిన్ పేరుకుపోయి నల్లని పొరలా మారుతుంది.
నివారణోపాయాలు: షేవింగ్‌కు బదులుగా వ్యాక్సింగ్ లేదా హేయిర్ రిమూవల్ కోసం మంచి పద్ధతులను ఎంచుకోండి. ఆల్కహాల్ లేని, నేచురల్ లేదా సున్నితమైన డియోడరెంట్లను వాడండి. నేరుగా స్ప్రే చేయకుండా బట్టలపై స్ప్రే చేసుకోవడం మంచిది. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలుగా ఉండే కాటన్, లూజ్ దుస్తులను ధరించండి. వారానికి ఒకట్రెండు సార్లు శనగపిండి, పెరుగు లేదా నిమ్మరసం వంటి సహజసిద్ధమైన ప్యాక్‌లతో ఆ భాగాన్ని సున్నితంగా స్క్రబ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం నలుపు తగ్గుతుంది.





