July 11, 2026

జెన్ జెడ్ (GenZ)నయా ట్రెండ్..ఖర్చుల కోసం అప్పులు..ఇన్వెస్ట్ మెంట్ యాజ్ యూజువల్.. ఎందుకో తెలుసా?

జెన్ జెడ్ (GenZ)నయా ట్రెండ్..ఖర్చుల కోసం అప్పులు..ఇన్వెస్ట్ మెంట్ యాజ్ యూజువల్.. ఎందుకో తెలుసా?
Reading Time: 2 minutes

జెన్ జెడ్ (GenZ)నయా ట్రెండ్..ఖర్చుల కోసం అప్పులు..ఇన్వెస్ట్ మెంట్ యాజ్ యూజువల్.. ఎందుకో తెలుసా?

Caption of Image.

అప్పులు చేయడం అంటే ఇంతకుముందు పెద్ద నేరంగా భావించేవారు. అప్పులు చేశారంటే వాడు దివాళా తీశాడు..వాడి పనైపోయింది.. ఇక వాడి దగ్గర ఏముంది.. ఇలాంటి కామెంట్స్ వింటుండేవాళ్లం.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పులు చేయడం ఇప్పుడున్న యువత అదే జెడ్ జెడ్ ఫ్యాషన్.. ఓ ఆర్థిక ప్రణాళికలో భాగం.. అవును మీరు వింటున్నది నిజం.. ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ముఖ్యంగా జెన్ జెడ్ (Gen Z) తరం వ్యక్తిగత రుణాలను అత్యవసర అవసరాలకే కాకుండా, తమ ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉపయోగిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం..యువత వ్యక్తిగత క్రెడిట్‌ను (Personal Credit) ఒక ఈజీ లిక్విడిటీ సాధనంగా చూస్తోంది.

గతంలో పెద్ద ఖర్చు వస్తే ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని డ్రా చేసేవారు. షేర్లు ఉంటే అమ్మేవారు. బ్యాంకుల్లో డబ్బులు ఉండే డ్రా చేసేశారు. స్థిరాస్తులు ఉంటే విక్రయించేవారు. అయితే ఇప్పుడు యువ రుణగ్రహీతలు( జెన్ జెడ్ ) తమ ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్‌ఫోలియోను అలాగే ఉంచి, ట్రావెలింగ్ , ఎడ్యుకేషన్, గ్యాడ్జెట్లు, జీవనశైలికి ఖర్చులు, అత్యవసర అవసరాలు వంటి వాటి కోసం క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ చాయిస్ గా ఎంచుకుంటున్నారు. దీంతో పెట్టుబడులపై వచ్చే దీర్ఘకాలిక లాభాలు కొనసాగుతూనే  అవసరమైన నిధులు కూడా వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి.

క్రెడిట్ బ్యూరో CRIF హైమార్క్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..2026 మే నాటికి జెన్ జెడ్ వినియోగ క్రెడిట్ (Consumer Credit) పోర్ట్‌ఫోలియో విలువ రూ.14.7 ట్రిలియన్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23.8 శాతం పెరిగింది. ఇందులో Unsecured Loans కీలకంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు (Personal Loans), క్రెడిట్ కార్డులు (Credit Cards) కలిసి మొత్తం రుణాల్లో 71 శాతం వాటా కలిగి ఉన్నాయంటే వారు ఏ రేంజ్ లో  వాడుతున్నారో అర్థమవుతోంది. 

అయితే ఆర్థిక నిపుణులు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత రుణం తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆదాయానికి అనుగుణంగా మాత్రమే రుణం తీసుకోవాలి. వడ్డీ రేట్లు (Interest Rates), ఈఎంఐ (EMI), రుణ కాలపరిమితి (Loan Tenure), క్రెడిట్ స్కోర్ (Credit Score), తిరిగి చెల్లించే కెపాసిటీ (Repayment Capacity) వంటి అంశాలను పూర్తిగా అంచనా వేసుకొని తర్వాతే రుణ తీసుకునేందుకు ముందుకు వెళ్లాలని అంటున్నారు.  సరైన ఆర్థిక క్రమశిక్షణతో వ్యక్తిగత రుణాలు తీసుకుంటే అవి భారం కాకుండా, ఆర్థిక నిర్వహణకు ఉపయోగపడే సాధనంగా మారతాయని నిపుణులు సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.