July 10, 2026

ముషీరాబాద్: ‘రోస్టర్’ను నిరసిస్తూ 11న ఆమరణ దీక్ష

ముషీరాబాద్: ‘రోస్టర్’ను నిరసిస్తూ 11న ఆమరణ దీక్ష
Reading Time: < 1 minute

ముషీరాబాద్: ‘రోస్టర్’ను నిరసిస్తూ 11న ఆమరణ దీక్ష

Caption of Image.

ముషీరాబాద్, వెలుగు: రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతోందని, దాన్ని సవరించాలని ఈనెల 11న చింతల్ బస్తీ కమిటీ హాల్ లో అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నె శ్రీధర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారని మాల సంఘాల జేఏసీ పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టర్​ను మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. 

జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ ఏమాత్రం పాటించకుండా న్యాయ నిపుణులను సంప్రదించకుండా దళిత ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేసిందని ఫైర్ అయ్యారు. షమీం అక్తర్ కమిషన్ ఏం చెప్పిందో కూడా పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాలల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మాంచాల లింగస్వామి, మాదాసు రాహుల్, దాసరి విశాల్, అనిల్, అంజలి పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.