శ్రీవారి భక్తులకు అలర్ట్: జులై నుండి సెప్టెంబర్ వరకు ఈ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు…Caption of Image.
తిరుమల శ్రీవారి భక్తులకు కీలక అలర్ట్ జారీ చేసింది టీటీడీ. జులై నుండి సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల తేదీలను ప్రకటించింది టీటీడీ. జూలై నుండి సెప్టంబర్ 30వ తేది వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాల రద్దు వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రేక్ దర్శనాలు రద్దైన తేది… కారణం:
జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
జులై17: ఆణివార ఆస్థానం.
జులై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద.
జులై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం.
ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ.
సెప్టంబర్ 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.
ఈ తేదీల్లో ముందు రోజు తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది టీటీడీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది టీటీడీ.