భారీ వర్షాలకు 100 ఏళ్ల క్లాక్ టవర్ నిలువునా కూలింది

కోజికోడ్ రైల్వే స్టేషన్ లో పాత క్లాక్ టవర్ కుప్పకూలింది. కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో 100 ఏళ్లకు పైగా పురాతనమైన క్లాక్ టవర్ గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ప్లాట్‌ఫామ్ నంబర్ 2 దగ్గర ఉదయం సుమారు 11గంటలకు జరిగింది.
దక్షిణ రైల్వే (SR) జోన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్ ప్రస్తుతం భారతీయ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద పునర్నిర్మాణం జరుగుతోంది. ముందస్తు జాగ్రత్త చర్యగా, ఆ ప్రదేశం సమీపంలో ప్రయాణికుల రాకపోకలను నిషేధించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
కేరళ భారీ వర్షాలు
భారీ వర్షాలు కేరళను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కేరళలోని మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఐఎమ్‌డి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, కన్నూర్, కాసరగోడ్ సహా మరో ఆరు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యాయి.
వయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు
భారీ వర్షాలతో వయనాడ్ లో జూలై 7న కొండచరియలు విరిగి పడ్డాయి. అనక్కోంపోయిల్ మెప్పాడి సొరంగం ప్రాజెక్టు ప్రదేశంలో కొండచరియలు విరిగిప ఐదుగురు చనిపోయారు. ఈ ఘటనలో మరో రెండు మృతదేహాలను వెలికి తీశారు.