Ramayana: రామాయణ బిజినెస్.. మరీ అంత తక్కువేంటి..?

రామాయణ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సంగతేంటి..? ఈ సినిమాకు ముందు అనుకున్నంత రైట్స్ పలకలేదా..? చివరికి చేసేదేం లేక సగం మొత్తానికే సినిమాను అమ్మేస్తున్నారా..? రామాయణ ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారు..? 4000 కోట్ల సినిమాకు ప్రమోషన్స్ ఎప్పట్నుంచి మొదలు కానున్నాయి..? నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ దీపావళి కానుకగా విడుదల కానుంది. 4,000 కోట్లతో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, హీరో యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. గతంలో బాహుబలి, 2.0, ద ఘాజీ ఎటాక్, దేవర లాంటి సినిమాలను ధర్మ ప్రొడక్షన్సే విడుదల చేసింది. ఈ డిస్ట్రిబ్యూషన్ డీల్ కోసం నిర్మాత నమిత్ మల్హోత్రా.. డిస్ట్రిబ్యూటర్లకు 30 నిమిషాల ఎడిట్ చేసిన ఫుటేజీని చూపించారని తెలుస్తుంది. ముందుగా రైట్స్ కోసం రూ. 500 కోట్లతో చర్చలు మొదలైనప్పటికీ.. చివరకు 250 కోట్లకి ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఇందులో రాముడుగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమాన్‌గా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రామాయణపై ఉన్న హైప్‌కు 250 కోట్లు అంటే తక్కువే..! కానీ ధర్మా ప్రొడక్షన్స్‌కు ఇది రిస్క్‌తో కూడుకున్నదే. కొన్నాళ్లుగా కరణ్ జోహార్ ప్లాపుల్లో ఉన్నారు. మరోవైపు జూలై 18న రామాయణ ట్రైలర్ రానుంది. రిలీజ్‌కు 2 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేసి.. హైప్ పెంచాలని చూస్తున్నారు మేకర్స్. మొత్తానికి బిజినెస్ పరంగా రామాయణ నెమ్మదిగానే అడుగులేస్తుంది.. రిలీజ్ తర్వాత దూకుడు పెరుగుతుందేమో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా
వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్
ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!
మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..