Mega Job Mela: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? 10th టూ PG అందరికీ సూపర్ ఛాన్స్..! కళ్లు చెదిరే జీతం..

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఉద్యోగాల కోసం నెలల తరబడి కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై వందకు పైగా కంపెనీలను యువతకు అవకాశాలు కల్పించేందుకు ముందుకు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి. జూలై 12న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి విజయవాడ మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ జాబ్ మేళా జరగనుంది. బీఎన్‌ఐ విజయవాడకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ భారీ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు చెబుతున్నారు.
ఎంఎన్‌సీలతో భారీ అవకాశాలు
ఈ జాబ్ మేళాలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు కలిపి వందకు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా జెన్‌ప్యాక్ట్, టెలిపర్‌ఫార్మెన్స్ వంటి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు కూడా నియామకాలు చేపట్టనున్నాయి. ఐటీ, బీపీవో, తయారీ, రిటైల్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ వంటి పలు రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఒకే రోజులో ఇంటర్వ్యూలు నిర్వహించి తగిన అభ్యర్థులను ఎంపిక చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఎవరు అర్హులు.. ఎంత జీతం?
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా జీతభత్యాలు నిర్ణయించనున్నారు. కొత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాలనుకునే వారికి, ఉద్యోగం మార్చుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశమని నిర్వాహకులు చెబుతున్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి
అయితే జాబ్ మేళాకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి ముందుగా ఏపీఎస్ఎస్‌డీసీ నైపుణ్యం పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత రెజ్యూమ్ లేదా బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, పాన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలి. ఇంటర్వ్యూలు అదే రోజు నిర్వహించి తగిన అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయించే ప్రక్రియ చేపట్టనున్నారు. మరిన్ని వివరాల కోసం నిర్వాహకులు విడుదల చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఉద్యోగం కోసం ఇదే సరైన అవకాశం
ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఉద్యోగం దక్కడం అంత సులభం కాదు. అలాంటి సమయంలో ఒకే వేదికపై వందకు పైగా కంపెనీలు, వేలాది ఉద్యోగ అవకాశాలతో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారనుంది. సరైన అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరైతే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విజయవాడలో జరిగే ఈ మెగా జాబ్ మేళా ఎందరికో కొత్త కెరీర్‌కు నాంది పలికే వేదికగా నిలవనుంది.
ఇదిగో ఫుల్ డీటెల్స్
Ap Job Mela
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.