July 9, 2026

రేపే ఫ్రాన్స్ vs మొరాకో క్వార్టర్ ఫైనల్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

రేపే ఫ్రాన్స్ vs మొరాకో క్వార్టర్ ఫైనల్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
Reading Time: 2 minutes

రేపే ఫ్రాన్స్ vs మొరాకో క్వార్టర్ ఫైనల్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

Caption of Image.

France vs Morocco: ఫుట్‌బాల్ ప్రపంచంలో మరో హై-వోల్టేజ్ పోరుకు తెరలేచింది. నాకౌట్ దశలో స్వీడన్, పరాగ్వేలను అలవోకగా ఓడించి, కేవలం ఒకే ఒక్క గోల్ సమర్పించుకున్న ఫ్రాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్‌లా దూసుకుపోతోంది. మరోవైపు, నెదర్లాండ్స్, కెనడాల కలలను చిదిమేస్తూ, అద్భుతమైన డిఫెన్స్‌తో సంచలనాలు సృష్టిస్తున్న మొరాకో జట్టు సవాల్ విసురుతోంది. ఇది 2022 ప్రపంచ కప్ సెమీఫైనల్ తలపింపజేసే మ్యాచ్.. గతంలో మొరాకో ఎక్కువ సమయం బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, ఫ్రాన్స్ కిరాక్ ఫినిషింగ్‌తో 2–0 తేడాతో విజయం సాధించింది. కానీ ఈసారి సీన్ రివర్స్ అవువుందని మొరాకో అంటుంది. 

ఫ్రాన్స్ వ్యూహం: 
* వింగ్స్ ద్వారా ఎటాక్: మొరాకో డిఫెన్స్‌ను చేధించడానికి ఫ్రాన్స్ పిచ్‌ను పూర్తిగా వాడుకుంటూ వైడ్‌గా ఆడాలని చూస్తోంది.

* స్టార్ ప్లేయర్ల ఐసోలేషన్: హకీమీపై ఒత్తిడి పెంచుతూ ఎంబాప్పే, బార్కోలాను ఐసోలేట్ చేసి గోల్స్ కొట్టడం ఫ్రాన్స్ ప్లాన్.

* పీఎస్‌జీ కనెక్షన్: ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డెంబెలే, ఎంబాప్పె, బార్కోలా, డౌయ్, హకీమీలంతా క్లబ్ ఫుట్‌బాల్‌లో PSG (పిఎస్‌జీ) జట్టు తరఫున ఆడినవారే కావడంతో ఒకరి బలాలు, బలహీనతలు మరోకరికి చాలా బాగా తెలిసి ఉంటాయి. 

మొరాకో కౌంటర్ ప్లాన్: 
* డిఫెన్స్ కోట: మొరాకో వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డిఫెన్స్‌ను బలంగా ఉంచి, ఫ్రాన్స్‌ను కేవలం క్రాస్‌లకే పరిమితం చేయడం.

* కౌంటర్ ఎటాక్: బంతి దొరికిన వెంటనే హకీమీ, రాహిమీల వేగంతో ఫ్రాన్స్ డిఫెన్స్‌పై ఎదురుదాడి చేయాలని ప్లాన్. 

* సెట్ పీసెస్ పైనే భారం: హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో కీలక ఆటగాడు ఇస్మాయిల్ సైబారీ దూరం కావడం మొరాకోకు పెద్ద దెబ్బ అని చెప్పాలి. అందుకే ఎక్కువ మంది ఆటగాళ్లను ముందుకు పంపకుండా, కేవలం డెడ్ బాల్ (ఫ్రీ కిక్స్, కార్నర్స్) అవకాశాలనే గోల్స్‌గా మలచుకోవాలని మొరాకో చూస్తోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్: 
ఫ్రాన్స్ వర్సెస్ మొరాకో జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 6 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ఫ్రాన్స్ 4 మ్యాచుల్లో గెలిచింది. ఇక 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఫ్రాన్స్ 2–0తేడాతో విజయం సాధించింది. 

మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?:
ఈ బిగ్‌ఫైట్‌ రేపు (జూలై 10) అర్థరాత్రి 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) జిల్లెట్ స్టేడియం వేదికగా, ఫాక్స్‌బరో, మాసచుసెట్స్ లో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ని టీవీల్లో చూసే వారు యునైట్8 స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Unite8 Sports) చూడొచ్చు.. అలాగే జీ 5 (Zee 5) యాప్,  వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. 

టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉందంటే: 
ఈ మ్యాచ్ ఫలితం పూర్తిగా వింగ్స్ మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ మొరాకో డిఫెండర్లు హకీమీ, మజ్రౌయ్‌లు కలిసి ఫ్రాన్స్ స్టార్స్ అయిన బార్కోలా, డెంబెలేలను కట్టడి చేయగలిగితే.. మ్యాచ్ చివరి 30 నిమిషాల్లో ఒత్తిడి మొత్తం ఫ్రాన్స్ పైకి వెళ్తుంది.. అప్పుడు మొరాకో మరో సంచలన విజయాన్ని నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

©️ VIL Media Pvt Ltd.