July 9, 2026

Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు

Mittapalli Surendar: ఇడుపు కాయితం వివాదం..వారికి తెలంగాణ లిరిసిస్ట్ ధన్యవాదాలు
Reading Time: < 1 minute
Lyricist Mittapalli Surender Reacts To Idupu Kayitham Title Controversy

పరిశ్రమలో కొన్ని టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు వివాదాలు తలెత్తడం సహజం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాగే హాట్ టాపిక్‌గా మారిన ఒక అంశంపై ప్రముఖ గీత రచయిత మిట్టపల్లి సురేందర్ తనదైన శైలిలో స్పందించారు. రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న ‘మారెమ్మ’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘ఇడుపు కాయితం’ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఏదైనా టైటిల్ చుట్టూ కాంట్రవర్సీ నడుస్తుంటే చిత్ర యూనిట్ కాస్త డిఫెన్స్‌లో పడుతుంది. కానీ, మిట్టపల్లి సురేందర్ మాత్రం దీన్ని చాలా పాజిటివ్‌గా తీసుకున్నారు. “ఈ చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ పెట్టి దర్శకుడితో పాటు నిర్మాతలు చాలా మంచి పని చేశారు. ప్రస్తుతం దీని చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని నేను అస్సలు వివాదంగా భావించడం లేదు. సమాజంలో ఒక వైవిధ్యమైన అంశంపై జరుగుతున్న చర్చగానే నేను దీన్ని చూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లడానికి ప్రమోషన్స్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ.. “ఏ సినిమాకైనా రిలీజ్ కంటే ముందే ప్రజల్లో ఇంతటి ఆసక్తి, సుదీర్ఘమైన చర్చ జరగడం నిజంగా చాలా మంచి పరిణామం. దీనివల్ల సినిమా కథపై, అందులోని కాన్సెప్ట్‌పై ఆడియన్స్‌కు ఒక క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఇంతటి వైవిధ్యమైన, బోల్డ్ టైటిల్‌ను ఎంచుకున్నందుకు ఈ చిత్ర దర్శకుడికి, నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ సురేందర్ చిత్ర బృందాన్ని అభినందించారు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక విలువలు కాపాడుకుంటూ వస్తున్న మిట్టపల్లి సురేందర్, తాజా వివాదాన్ని కూడా ఇంత పాజిటివ్‌ కోణంలో విశ్లేషించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి.