July 8, 2026

ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు మైండ్ చాలా షార్ప్.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో సాల్వ్ చేస్తారు!

ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు మైండ్ చాలా షార్ప్.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో సాల్వ్ చేస్తారు!
Reading Time: 2 minutes

ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు మైండ్ చాలా షార్ప్.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో సాల్వ్ చేస్తారు!

Caption of Image.

న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం, మనం పుట్టిన తేదీ మన స్వభావం, తెలివితేటలు, ఆలోచనా విధానం ఎలా ఉంటాయో చెబుతుంది. ప్రతి సంఖ్యకు ఒక అధిపతి గ్రహం ఉంటుంది. ఆ గ్రహాల ప్రభావం వల్లే కొందరికి అద్భుతమైన తెలివితేటలు, జ్ఞాపకశక్తి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తాయి.

ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వాళ్లు పుట్టుకతోనే చాలా చురుగ్గా ఉంటారు. ఆ అదృష్ట సంఖ్యలు (Radix) ఏంటో, వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం:

అదృష్ట సంఖ్య 5 (పుట్టిన తేదీలు: 5, 14, 23)
మీరు ఏదైనా నెలలో 5, 14 లేదా 23వ తేదీల్లో పుట్టారంటే మీ అదృష్ట సంఖ్య నంబర్ 5 అన్నమాట. ఈ సంఖ్యకు బుధ గ్రహం అధిపతి. జ్యోతిష్యం ప్రకారం బుధుడు తెలివితేటలు, మాటకారితనం, బిజినెస్ మైండ్‌కు చిహ్నం. వీళ్లు విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటారు. ఎలాంటి పరిస్థితులకైనా చాలా ఈజీగా అలవాటు పడిపోతారు.

ప్రత్యేకత: ఎంతటి పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించగలరు. ఎదుటివారికి మంచి సలహాలు ఇవ్వడంలో వీళ్లు దిట్ట. కొత్త విషయాలను చాలా స్పీడ్‌గా నేర్చుకుంటారు. వీరి తెలివితేటలు ఇతరులకు మేలు చేసేలా ఉంటాయే తప్ప, మోసం చేయడానికి అస్సలు ఉపయోగించరు.

అదృష్ట సంఖ్య 3 (పుట్టిన తేదీలు: 3, 12, 21, 30)
ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30వ తేదీల్లో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యను గురు గ్రహం (బృహస్పతి) పాలిస్తుంది. గురువు ప్రభావం వల్ల వీరికి జ్ఞానం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వంద మందిలో ఉన్నా వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

ప్రత్యేకత: వీళ్ల మైండ్ చాలా షార్ప్, కొంచెం జిత్తులమారిగా కూడా ఆలోచించగలరు. అయితే, ఆ జిత్తులమారితనంతో ఎవరికీ కీడు చేయరు, కానీ వారికీ వచ్చిన కష్టాల నుంచి బయటపడటానికి వాడుకుంటారు. ఎవరైనా వీరితో పెట్టుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు, అదే రేంజ్‌లో తిప్పికొడతారు.

అదృష్ట సంఖ్య 4 (పుట్టిన తేదీలు: 4, 13, 22, 31)
ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31వ తేదీల్లో పుట్టిన వారి అదృష్ట నంబర్ 4. ఈ సంఖ్యపై రాహు గ్రహం ప్రభావం బలంగా ఉంటుంది. వీళ్లు చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తారు, అలాగే కాస్త ఎమోషనల్ కూడా. ఎవరి మాటా వినకుండా, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరికి అలవాటు.

►ALSO READ | పేరు పెట్టడం ఇంత ఈజీనా..! ఈ ట్రిక్స్ పాటిస్తే.. మీ పిల్లలకు.. ట్రెండీగా.. అందరికీ నచ్చే పేరు రెడీ.

ప్రత్యేకత: రాహువు ప్రభావం వల్ల ఎంతటి కష్టమైన సవాలునైనా చాలా కూల్‌గా, సులువుగా సాల్వ్ చేస్తారు. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడరు, స్వతంత్రంగా ఉండాలి అనుకుంటారు. సమాజంలో మంచి లీడర్లుగా ఎదుగుతూ ఇతరులకు రోల్ మోడల్‌గా నిలుస్తారు.

చివరగా… ఒకవేళ మీ పుట్టిన తేదీ కూడా పైన చెప్పిన వాటిలో ఉంటే… లీడర్‌షిప్, క్విక్ డెసిషన్స్, షార్ప్ మైండ్ అనేవి దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యేకమైన గిఫ్ట్స్ అన్నమాట!

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.