July 8, 2026

Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..

Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
Reading Time: < 1 minute
Bengaluru Cobra Stops Traffic Palace Road

Bengaluru:  నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే బెంగళూర్ రోడ్డుపైకి ఊహించని అతిథి వచ్చింది. రోడ్డు మధ్యలో పగడ విప్పిన నాగుపాము ఏకంగా 30 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్‌కు కారణంమైంది. నగరంలోని ప్యాలెస్ రోడ్డుపై పడగ విప్పి కనిపించడంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి.. “నిన్న బెంగళూరు ట్రాఫిక్‌కు సరికొత్త VIP కలుసుకుంది. ప్యాలెస్ రోడ్‌పై ఒక నాగుపాము.” అని కామెంట్ చేశారు. ట్రాఫిక్ నియమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, 30 నిమిషాలు ధ్యానం చేయడానికి రోడ్డుపైకి వచ్చిందని మరొకరు వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ జామ్ పెద్దది కావడంతో పోలీసులు చివరకు చేరుకుని రోడ్డుకు అవతలి వైపు పాము వెళ్లిపోయేలా చేశారు.