July 10, 2026

Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్‌వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
Reading Time: 2 minutes
Timex Deepwater Meridian 300 Titanium Hev Automatic Debuts With 300m Water Resistance

ప్రముఖ వాచ్ తయారీ సంస్థ టైమెక్స్ (Timex) తన కొత్త ప్రీమియం డైవింగ్ వాచ్ Deepwater Meridian 300 Titanium HEV Automaticను అధికారికంగా విడుదల చేసింది. ప్రత్యేకంగా డైవింగ్, అడ్వెంచర్ ప్రియుల కోసం రూపొందించిన ఈ మెకానికల్ వాచ్ 300 మీటర్ల లోతు వరకు నీటి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. టైటానియం బాడీ, సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ మూవ్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ వాచ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.

ధర ఎంత?

Timex Deepwater Meridian 300 Titanium HEV Automatic ప్రస్తుతం అమెరికా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ ధర 999 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.95,000)గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది టైమెక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ వాచ్‌లో 44mm డయల్ అందించారు. కేస్‌ను గ్రేడ్-5 టైటానియంతో తయారు చేయడం వల్ల ఇది బరువు తక్కువగా ఉండటంతో పాటు అత్యంత బలంగా ఉంటుంది.

44mm డయల్
15mm మందం
51mm లగ్-టు-లగ్ పొడవు
మ్యాట్ ఫినిష్ టైటానియం కేస్
సఫైర్ క్రిస్టల్ గ్లాస్
యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్

సఫైర్ క్రిస్టల్ డిస్‌ప్లే గీతల నుంచి రక్షణ కల్పించడమే కాకుండా సన్ లైట్ లో కూడా స్పష్టమైన విజిబిలిటీని అందిస్తుంది.

300 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్

ఈ వాచ్‌లో ప్రధాన ఆకర్షణ 300 మీటర్ల వాటర్ రెసిస్టెన్స్. ప్రొఫెషనల్ డైవింగ్ అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించారు. దీనిలో స్క్రూ-డౌన్ క్రౌన్, క్రౌన్ గార్డ్, స్క్రూ-డౌన్ కేస్ బ్యాక్, ఆటోమేటిక్ హీలియం ఎస్కేప్ వాల్వ్ (HEV) వంటి ప్రత్యేక డైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. శాచురేషన్ డైవింగ్ సమయంలో వాచ్ లోపల పేరుకుపోయే హీలియం వాయువును HEV సురక్షితంగా బయటకు పంపుతుంది. దీంతో అంతర్గత ఒత్తిడి పెరగకుండా ఉండి వాచ్ గ్లాస్‌కు నష్టం జరగకుండా కాపాడుతుంది.

ఆటోమేటిక్ మూవ్‌మెంట్

ఈ వాచ్‌లో Miyota 8215 Automatic Movementను ఉపయోగించారు. ఇది 21 జ్యువెల్ జపనీస్ మెకానికల్ క్యాలిబర్, చేతి కదలికతో ఆటోమేటిక్‌గా విండ్ అవుతుంది. గరిష్టంగా 40 గంటల పవర్ రిజర్వ్, అవసరమైతే క్రౌన్ ద్వారా మాన్యువల్ విండింగ్ సపోర్ట్ అందిస్తుంది.

రెండు కలర్ ఆప్షన్లు

Timex ఈ వాచ్‌ను రెండు రంగుల్లో అందిస్తోంది. బ్లాక్ డయల్, గ్రీన్ డయల్. తక్కువ వెలుతురులో కూడా స్పష్టంగా కనిపించేలా జపనీస్ Nemoto Luminova SG2200 ల్యూమినస్ కోటింగ్‌ను డయల్‌పై ఉపయోగించారు.

స్ట్రాప్ కూడా ప్రత్యేకమే

ఈ వాచ్‌లో 20mm HNBR (Hydrogenated Nitrile Butadiene Rubber) స్ట్రాప్‌ను అందించారు. ఈ స్ట్రాప్ యూవీ రేస్ రెసిస్టెన్స్, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం, రసాయనాల ప్రభావానికి రక్షణ, దీర్ఘకాలిక మన్నిక వంటి ప్రయోజనాలను అందిస్తుంది.