స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే 51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ గ్లామరస్ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంది. ఈ అందాల తార క్రేజ్ ను చూసి స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే వారు. తన అందం, అభినయంతో సినిమాల్లో సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచింది.
పెళ్లైన హీరోలతో అలాగే టీమిండియా దిగ్గజ క్రికెటర్ తోనూ రిలేషన్ నడిపిందని ప్రచారం జరిగింది. ఈ బ్యూటీపై అప్పట్లో తెగ రూమర్లు వినిపించాయి. ఇవి నిజమో, అబద్ధమో తెలియదు కానీ 50 ఏళ్లు వచ్చినప్పటికీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆ హీరోయిన్ ఎవరో ఈపాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. తను మరెవరో కాదు నగ్మా. తాజాగా నగ్మా ఓల్డ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోల వరకూ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇతర రంగాలతో పోలిస్తే సినిమా సెలబ్రిటీలకు చాలా క్రేజ్ ఉంటుంది. అదే సమయంలో వారి వ్యక్తిగత జీవిత విషయాలు కూడా తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. పెళ్లి సందడి సినిమాలో రాఘవేంద్ర రావు చెప్పినట్లు ‘అరేబియన్ గుర్రమంటి నలక నడుమున్న నగ్మా’ తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది.
అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్లతో పాటు క్రికెటర్ సౌరవ్ గంగూలీతోనూ లవ్‌లో పడిందని ప్రచారం సాగింది. అయితే ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటితో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది.
అయితే కాలం కలిసొస్తే మాత్రం తప్పకుండా పెళ్లి చేసుకుంటానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నగ్మా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలకు నగ్మా పూర్తిగా దూరం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా కొనసాగుతుంది నగ్మా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నగ్మా పార్టీకి సంబందించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉంటుంది.




