July 10, 2026

Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..
Reading Time: 2 minutes
Ayushman Sarathi: వాట్సప్ ద్వారా ఆయుష్మాన్ భారత్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? సెకన్లలోనే కార్డు పొందోచ్చు..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు ఆరోగ్య భద్రత అందించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా దేశంలోని ప్రైవేట్ హాస్పిటళ్లల్లో చికిత్స పొందవచ్చు. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ స్కీమ్‌లో కోట్లాది మంది చేరగా.. అనేకమంది లబ్ది పొందుతున్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ నుంచే వాట్సప్ ద్వారా ఈ పథకం సేవలను ప్రజలు పొందవచ్చు. ఇందుకోసం వాట్సప్ చాట్‌బాట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో వాట్సప్ ద్వారానే ఈ పథకానిక దరఖాస్తు చేసుకోవడంతో పాటు మిగతా అన్ని సేవలు పొందవచ్చు.

ఆయుష్మాన్ కార్డు కోసం వాట్సప్ ద్వారానే ప్రజలు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటోకి వచ్చింది. దీంతో అర్హులైనవారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకుని కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందకోసం ఆయుష్మాన్ సారథి చాట్‌బాట్‌ను కేంద్రం ప్రారంభించింది. జాతీయ ఆరోగ్య సంస్థ (NHA) అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్.. PM-JAY డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానించబడి ఉంటుంది. దీంతో అనేక ఆరోగ్య సంరక్షణ సంబంధిత సేవలకు 24 గంటల పాటు లభిస్తాయి. వాట్సాప్ ద్వారా ప్రజలు తమ అర్హతను చెక్ చేసుకోవడంతో పాటు ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

-మీ మొబైల్ ఫోన్‌లో 7290823838 నెంబర్‌ను సేవ్ చేసుకోండి

-వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు “Hi” అని మెస్సేజ్ పంపండి

-చాట్‌బాట్ మెనూ నుండి “ఆయుష్మాన్ కార్డ్ సృష్టించండి” అనే ఆప్షన్ ఎంచుకోండి

-మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో సహా అవసరమైన వివరాలను నమోదు చేయండి

-OTPని ధృవీకరించి, e-KYC ప్రక్రియను పూర్తి చేయండి

-ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఆయుష్మాన్ కార్డ్ జారీ చేయబడుతుంది

-వెంటనే అక్కడ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు..?

-e-KYC ధృవీకరణను పూర్తి చేయవచ్చు

– ఆధార్ నంబర్‌ లింక్ చేసుకోవచ్చు

-ఆయుష్మాన్ కార్డు డౌన్‌లోడ్

-PM-JAY కార్డును లాక్ లేదా అన్‌లాక్ చేయడం

-P70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు వయో వందన కార్డ్ సేవలు

-వైద్య చరిత్ర, వాలెట్ బ్యాలెన్స్‌న చూసుకోవడం

-సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆసుపత్రులను కనిపెట్టవచ్చు

-ఫిర్యాదులను నమోదు చేసి ట్రాక్ చేసే సౌకర్యం