Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్‌ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?

కోలీవుడ్‌లో మాస్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు ధనుష్. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఏడాదికి వన్ ఆర్ టూ ఫిల్మ్ తన నుండి కచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. గత ఏడాది త్రీ ఫిల్మ్స్ దించిన కోలీవుడ్ హీరో ఈ ఏడాది కరతో పలకరించాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘ఓమ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ధనుష్ కోసం నెక్ట్స్ డైరెక్టర్స్ తమిళ రాసన్ పచ్చముత్తు, మారి సెల్వరాజ్ వెయిట్ చేస్తున్నారు.
ధనుష్ లైనప్ భారీగానే ఉన్నా ఎప్పుడో ఎనౌన్స్ చేసిన బయోపిక్స్ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా బయోపిక్ ఎనౌన్స్ చేసి రెండేళ్లు దాటిపోయింది. 2024లో కమల్ హాసన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ మూవీ ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ధనుష్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో అరుణ్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఇంట్రడ్యూసౌతున్న డీసీకి షిఫ్టయ్యాడు. పోనీ దీని తర్వాతైనా ధనుష్‌తో మూవీ ఉంటుందా అంటే డౌటే. సౌత్‌లో ఎనౌన్స్ చేసిన బయోపిక్కే పట్టించుకోలేదంటేబాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రముఖ శాస్త్రవేత్త, ఇండియా మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం మూవీని ఎనౌన్స్ చేశాడు. ఆ ప్రకటనొచ్చి ఏడాది దాటిపోతుంది. కానీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రాజెక్ట్ బ్రతికే ఉందని మేకర్స్ చెబుతున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు కోలీవుడ్ ఆడియన్స్. అటు ఇళయరాజా కానీ ఇటు అబ్దుల్ కలాం బయోపిక్స్ ప్రయోగాత్మక సినిమాలు. వీటి కోసం లుక్స్, గెటప్ ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. వీటికి కమిటైతే.. మరో మూవీ టచ్ చేయడానికి ఛాన్స్ ఉండని నేపథ్యంలోనే ధనుష్ ఈ ప్రాజెక్ట్ హోల్స్ చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది.