హైదరాబాద్ లో పనిమనిషితో అక్రమ సంబంధం.. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..

ఈరోజుల్లో అక్రమ సంబంధాలు కామన్ అయిపోతున్నాయి… తరచూ ఎక్కడో ఒకచోట అక్రమ సంబంధాల గురించి వార్తలు వింటూనే ఉన్నాం. హైదరాబాద్ లోని ఉప్పల్ లో మరో అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ లో పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. బుధవారం ( జులై 8 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
అనకాపల్లికి చెందిన ఛంబేటీ కుమారి, శివలు 2004లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇంటర్ చదువుతున్న ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ఉప్పల్ లోని కురుమనగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వీరి ఇంట్లోకి పనిమనిషిగా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి అనే మహిళ. అప్పటి నుంచి కుమారి, శివ మధ్య గొడవలు మొదలయ్యాయి.
గత ఐదు సంవత్సరాలుగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. కుమారికి డైవర్స్ నోటీసు కూడా పంపాడు శివ. ఈ క్రమంలో శివ, పనిమనిషి లక్ష్మి కురుమ నగర్‌లో రహస్యంగా ఓ ఇంట్లో ఉండగా బంధువుల సహాయంతో పట్టుకుంది భార్య.
ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించింది కుమారి. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కుమారి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.