July 8, 2026

ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులు!

ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులు!
Reading Time: < 1 minute
ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులు!

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. రోజూలాగే తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు వింటున్న విద్యార్థులకు ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఒకే క్లాస్ రూమ్‌లో ఏకంగా మూడు పాము పిల్లలు ప్రత్యక్షమవడంతో విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేస్తూ గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు.విద్యార్థుల అరుపులు విన్న పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ఉపాధ్యాయులు, స్థానికులు కలిసి ఆ పాములను జాగ్రత్తగా పాఠశాల ఆవరణ నుంచి బయటకు తరిమేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

సౌత్‌ టాలెంట్ మీద ఆశలు.. బాలీవుడ్‌లో నయా ట్రెండ్‌

నెలలోపే ఓటీటీలో… బిగ్‌ స్క్రీన్‌కు భారీ గండి

గేమ్ ప్లాన్ మార్చిన టాప్ బ్యూటీస్‌..