July 9, 2026

వీరు పెసరుపప్పు అస్సలు తినకూడదు.. తిన్నారో ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లడం పక్కా..

వీరు పెసరుపప్పు అస్సలు తినకూడదు.. తిన్నారో ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లడం పక్కా..
Reading Time: 2 minutes
వీరు పెసరుపప్పు అస్సలు తినకూడదు.. తిన్నారో ఈ సమస్యలతో ఆస్పత్రికి వెళ్లడం పక్కా..

మన నిత్య జీవితంలో వాడే పప్పుధాన్యాలన్నింటిలోకి పెసరపప్పు అత్యంత శ్రేష్ఠమైనదని పెద్దలు చెబుతుంటారు. పప్పుధాన్యాలలో ప్రొటీన్లు, కాపర్, ఫోలేట్, రిబోఫ్లావిన్, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, థయామిన్ వంటి ఎన్నో అవశ్యక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటన్నింటిలోనూ పెసరపప్పు చాలా తేలికగా అరుగుతూ, జీర్ణశక్తిని పెంచే గుణం కలిగి ఉంటుంది. అయినప్పటికీ, దీని మితిమీరిన వాడకం లేదా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తినడం వల్ల కొన్ని నష్టాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.

పెసరపప్పుతో కలిగే అద్భుత ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తి: పెసరపప్పులో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతుంది.

బరువు నియంత్రణ: ఇందులో ఉండే అధిక ప్రొటీన్ కంటెంట్ బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.

షుగర్ కంట్రోల్: పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒకేసారి పెరగకుండా క్రమంగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

అతిగా తింటే అమృతం కూడా విషమే..

సాధారణంగా పెసరపప్పు వల్ల ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ, అమితంగా తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని డాక్టర్ రసిక మాథుర్ స్పష్టం చేశారు.

గ్యాస్, కడుపు ఉబ్బరం: పచ్చి పెసలు లేదా సరిగా ఉడకని పెసరపప్పును ఎక్కువగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

యూరిక్ యాసిడ్ సమస్యలు: శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు పొట్టు తీయని పూర్తి పప్పుధాన్యాలను తీసుకోకపోవడమే మంచిది. పెసరపప్పును అతిగా తింటే శరీరంలో ‘ప్యూరిన్’ ఫార్మేషన్ పెరిగి, అది యూరిక్ యాసిడ్‌గా మారుతుంది. ఇది కీళ్ల నొప్పులకు దారితీస్తుంది.

ఇతర లక్షణాలు: పెసరపప్పును అతిగా లాగించేయడం వల్ల కొందరిలో కడుపునొప్పి, కళ్లు తిరగడం, వికారం, విరేచనాలు వంటి ముప్పు పెరిగే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్ మాథుర్ వెల్లడించారు.

మొలకలు, హల్వా, కిచిడీ ఇలా ఏ రూపంలోనైనా పెసరపప్పును డైట్‌లో చేర్చుకోవచ్చు. కానీ ఏ ఆహారమైనా పరిమితికి మించి తింటే ముప్పేనని, ముఖ్యంగా యూరిక్ యాసిడ్, గ్యాస్ సమస్యలు ఉన్నవారు పెసరపప్పు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ డైట్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్నా, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు.