Reading Time: < 1 minute
Ap Deputy Cm Pawan Kalyan To Undergo Shoulder Treatment In Mumbai

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భుజాలకు సంబంధించిన చికిత్స కోసం రేపు అనగా శుక్రవారం రోజు ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా ఆయన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యం ఎదుర్కొంటున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. ఇక, చికిత్స పూర్తయిన తరువాత కొద్ది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స పూర్తైయిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.

అయితే, గత ముంబై పర్యటనలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్.. ఆ తర్వాత కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించుకున్న విషయం విదితమే.. పవన్‌ 2 భుజాలను పరీక్షించిన వైద్యులు.. రొటేటర్ కఫ్ గాయంతోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారట.. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు.. అయితే, ముందుగానే నిర్ణయించిన పలు పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు ఉండడంతో.. కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు చికిత్స చేయించుకోవడానికి రేపు ముంబై వెళ్లనున్నారు.