July 10, 2026

Akhil Akkineni: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. నాగార్జున కాళ్లపై పడి ఏడ్చేసిన అఖిల్.!

Akhil Akkineni: 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్.. నాగార్జున కాళ్లపై పడి ఏడ్చేసిన అఖిల్.!
Reading Time: 2 minutes

Akhil Akkineni: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. నాగార్జున కాళ్లపై పడి ఏడ్చేసిన అఖిల్.!

Caption of Image.

గత కొన్నేళ్లుగా గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ కల నెరవేరింది. లేటెస్ట్ గా ఆయన నటించిన ‘లెనిన్ ‘ భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ( జూలై 10, 2026 ) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.. తొలి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అఖిల్ నటన,  సెకాండ్ ఆఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను మెప్పించాయి. అటు తమ అభిమాన హీరో అఖిల్ మూవీ హిట్ అయితే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక తీరింది.

అఖిల్ ఎమోషనల్..

ఈ మూవీ సక్సెస్ తో చిత్ర బృందం ఫుల్ ఖుషిలో ఉంది.  ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ మూవీ టీం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో అఖిల్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి.. ఆయన్ను గట్టిగా కౌగిలించుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ .. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

 

‘లెనిన్’ కథేంటంటే?

చిత్తూరు జిల్లాలోని శ్రీ రామాపురం అనే గ్రామంలో భారతం మిట్ట అనే జాతర ఫేమస్. 18 రోజుల పాటు జరిగే ఆ  జాతర రక్తపు చుక్క నేలపై పడకుండా జరగాలన్నది ఊరి కట్టుబాటు. ఆ జాతర పనులు చూస్తుంటాడు లెనిన్ (అఖిల్). అనాథ అయిన తనను ఆ ఊరి పెద్ద జయంతమ్మ  (ఈశ్వరీ రావు) చేరదీస్తుంది. తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో  కలిపి పెంచుతుంది. చిన్నపటి నుండి వసంత్ లెనిన్ స్నేహితులు. డాక్టర్ చదువు ముగించుకుని జాతర సమయానికి ఊరు వస్తాడు వసంత్. ఇక ఆలయ ధర్మకర్త పొజిషన్ కోసం జయంతమ్మ మరిది యతిరాజులు (శివాజీ) ప్రయత్నిస్తుంటాడు. కానీ తన మామ అక్రమ సంతానం అని ఆమె వ్యతిరేకిస్తుంది.

లెనిన్ ను అతను కొడుకులా చూసుకుంటాడు. మరోవైపు కటౌట్ విషయంలో తనను ఎదిరించిన లెనిన్పై ఎమ్మెల్యే రాఘవ రెడ్డి (రమేష్ ఇందిర) రగిలిపోతుంటాడు. ఇదిలా ఉంటే జాతరలో చూసిన  భారతి (భాగ్యశ్రీ బొర్సే) ని ప్రేమిస్తాడు లెనిన్. ఆమె కూడా ప్రేమిస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో వసంత్తో ఆమె పెళ్లి నిశ్చయం అవుతుంది. వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటాడు వసంత్. అయితే దుండగులు తనను చంపే ప్రయత్నం చేస్తారు. లెనిన్ కాపాడతాడు. ఇక పెళ్ళి తర్వాత  పరిస్థితులు అన్నీ లెనిన్, భారతీలకు ప్రతికూలంగా మారతాయి. దానికి కారణం ఎవరు.. మెకవన్నే పులుల్లా దాడి చేసిన వాళ్లపై లెనిన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది అసలు కథ.

ఎలా ఉందంటే?

మహాభారతంలోని కొన్ని పాత్రల స్వభావాలను ఆధునిక రాయలసీమ రాజకీయాలతో ముడిపెట్టి దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఫస్టాఫ్లో గ్రామ నేపథ్యం, పాత్రల పరిచయం, జాతర ఎపిసోడ్లు నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్‌కు ముందు నుంచి కథ వేగం అందుకుంటుంది. సెకండాఫ్లో భావోద్వేగాలు, యాక్షన్, రాజకీయ సంఘర్షణలు కథను ముందుకు నడిపిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా అనిపించడం, మొదటి భాగంలో ఇంకాస్త వేగం ఉంటే బాగుండేదనే భావన కలిగించినా, మొత్తంగా దర్శకుడు చెప్పాలనుకున్న భావాన్ని ప్రభావవంతంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

ALSO READ :  ‘లెనిన్’ ఫుల్ రివ్యూ.. అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడిందా? మూవీ ఎలా ఉందంటే..

ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ మునుపటి చిత్రాల కంటే చాలా భిన్నంగా చూపించారు.. ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినా, సెకండాఫ్, క్లైమాక్స్, తమన్ సంగీతం సినిమాను నిలబెడతాయి. ఎమోషనల్ సీన్స్‌లో రీ-రికార్డింగ్ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఓవరాల్ గా చెప్పాలంటే అఖిల్ అభిమానులు కాలర్ ఎత్తే సినిమాగా ‘లెనిన్’ నిలుస్తుంది. 

 

©️ VIL Media Pvt Ltd.