July 10, 2026

Lenin Movie: ‘లెనిన్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అఖిల్‌కు ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

Lenin Movie: ‘లెనిన్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అఖిల్‌కు ఛాన్స్ ఎలా వచ్చిందంటే?
Reading Time: 2 minutes
Lenin Movie: ‘లెనిన్’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? అఖిల్‌కు ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

ఎట్టకేలకు అయ్యగారు హిట్ కొట్టారు. హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్నా సాలిడ్ హిట్ లేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. శుక్రవారం (జులై 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. శివాజీ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక లెనిన్ సినిమాతో యాక్టింగ్ పరంగానూ ప్రశంసలు అందుకుంటున్నాడు అఖిల్. అయితే లెనిన్ సినిమా రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తకిర విషయం బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోగా అఖిల్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అక్కినేని హీరో కంటే ముందే ఒక స్టార్ హీరో దగ్గరకు ఈ స్టోరీ వెళ్లిందట. అయితే ఆయన రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ అఖిల్ దగ్గరకు వచ్చారట. కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. ఇప్పుడు కెరీర్ లో ఒక మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు.

లెనిన్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు న్యాచురల్ స్టార నాని అని తెలుస్తోంది. దసరా సినిమాతో మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నాని. కాబట్టి తన కథను అతనే బాగా సెట్ అవుతాడని అనుకున్నాడ డైరెక్టర్. అయితే డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమా కథను చెప్పినప్పుడు నాని ప్యారడైజ్ సినిమా బిజీలో ఉన్నాడట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్యారడైజ్ కు ఎక్కువ డేట్స్ కేటాయించడం వల్ల లెనిన్ సినిమా చేయలేనని చెప్పాడట. అలా ఈ సినిమా అఖిల్ దగ్గరకు వెళ్లిందట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. ఒకవేళ నాని లెనిన్ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదోనని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు.

లెనిన్ సినిమా విషయానికి వస్తే..హారిక అండ్ హాసిని క్రియేషన్స్, అన్నపూర్ణ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రమోద్ మంజు, శివాజీ, ప్రవీణ్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించగా, లియోన్ ప్రిట్టో సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

లెనిన్ కు పాజిటివ్ టాక్.. అఖిల్ ఎమోషనల్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి