July 10, 2026

న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని.. విమానాశ్రయంలో మోదీకి అపూర్వ స్వాగతం..!

న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని.. విమానాశ్రయంలో మోదీకి అపూర్వ స్వాగతం..!
Reading Time: < 1 minute
న్యూజిలాండ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని.. విమానాశ్రయంలో మోదీకి అపూర్వ స్వాగతం..!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరి దశలో న్యూజిలాండ్‌కు చేరుకున్నారు. శుక్రవారం (జూలై10) ఆయన ఆక్లాండ్ నగరంలో అడుగుపెట్టారు. ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి, ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని అత్యంత ఆత్మీయంగా, ఘనంగా స్వాగతం పలికారు.

ప్రధాని లక్సన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ అధికారిక పర్యటనను చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, పరస్పర సహకారాన్ని మరింత ఉన్నత స్థాయికి పెంపొందించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి. ద్వైపాక్షిక సమావేశాలతో పాటు, ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన పలు అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..