మమతా బెనర్జీ ర్యాలీపై కోడిగుడ్ల దాడి.. టీఎంసీ ర్యాలీలో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేపట్టిన ర్యాలీలో ఉద్రికత్త నెలకొంది. కోల్ కతాల్లో టీఎంసీ ర్యాలీపై కోడిగుడ్లు విసిరారు దుండగులు. బారుయిపూర్ లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా టీఎంసీ చేపట్టిన ర్యాలీపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్డు విసరడంతో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మద్య ఘర్షణ తలెత్తింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపారు.
బారుయిపూర్ లో 11ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా మాజీ సీఎం మమతా బెనర్జీ తన కార్యకర్తలతో కలిసి భారీ నిరసనర్యాలీ తీసింది. స్థానిక బల్లిగంజ్ ఫారి నుంచి హజ్రా మోర్ వరకు సాగిన ఈ ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మమతా బెనర్జీ నివాసం సమీపంలో హజ్రా క్రాసింగ్ దగ్గర టీఎంసీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. మమతను ముందుకు పోనియ్యకుండా అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు లాఠీఛార్జ్ చేశారు.
ఇదిలా ఉంటే టీఎంసీ చేపట్టిన ర్యాలీకి కోల్ కతా పోలీసులు నిరాకరించారు.దీంతో కోల్ కతా హైకోర్టునుంచి అనుమతి పొందింది మమతా బెనర్జీ. షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ర్యాలీపై బీజేపీ కార్యకర్తల దాడిని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.దురుద్దేశంతోనే ర్యాలీని బీజేపీ అడ్డుకుందని మమతా అరోపించారు.