July 8, 2026

ఢిల్లీ, పూణెల్లో 3 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి..!

ఢిల్లీ, పూణెల్లో 3 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి..!
Reading Time: < 1 minute

ఢిల్లీ, పూణెల్లో 3 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి..!

Caption of Image.

దేశ వ్యాప్తంగా రెండు పెద్ద నగరాల్లో.. ఒకేసారి జరిగిన రెండ ఘటనలు దేశ ప్రజలను షాక్ కు గురి చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 3 అంతస్తుల భవనం నిట్టనిలువునా కూలిపోయింది.. ఇదే సమయంలో ఫూణెలో మరో మూడు అంతస్తుల భవనం కూలింది. ఈ రెండు ఘటనల్లో చాలా మంది శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో చనిపోయి ఉండొచ్చన్న వార్తలు వస్తున్నా.. శిథిలాల తొలగింపు తర్వాతనే స్పష్టమైన సమాచారం వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ఢిల్లీలో రోహిణి సెక్టార్ 16లో ఎంసీడీ స్కూల్ వెనక భాగంలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బిల్డింగ్ కు కొన్ని రోజులుగా మరమ్మతులు చేస్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్, డిజాస్టర్ టీమ్స్ స్పాట్ కు చేరుకున్నాయి. శిథిలాల తొలగింపు ప్రారంభించారు. ఈ బిల్డింగ్ కింద చాలా మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. ఎంత మంది అనేది స్పష్టంగా చెప్పటం లేదు అధికారులు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూలిపోయి ఉండొచ్చని చెబుతున్నారు.

ఇక మహారాష్ట్ర పూణెలోనూ సేమ్ టూ సేమ్ ఇలాంటి ఘటననే జరిగింది. పింప్రి చించ్ వాడ్ లోని ఓ ప్రాజెక్ట్ సైట్ లో బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. మూడు అంతస్తుల వరకు స్లాబ్ వేశారు. మధ్యాహ్నం తర్వాత ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 15 నుంచి 20 మంది కార్మికులు శిథిలాల కింద ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. 

ఈ రెండు ఘటనలు ఒకే రకంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఢిల్లీ, పూణెల్లో జరిగిన రెండు భవన ప్రమాదాల్లో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. బాధితులను వెంటనే బయటకు తీసుకురావటానికి అవసరం అయిన సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు అధికారులు. 

©️ VIL Media Pvt Ltd.