July 9, 2026

Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పెద్ది’.. రామ్ చరణ్ 400 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పెద్ది’.. రామ్ చరణ్ 400 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Reading Time: 2 minutes
Peddi OTT: ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘పెద్ది’.. రామ్ చరణ్ 400 కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 04న విడుదలైన పెద్ది సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ కు మెగాభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిందీ సినిమా. ఓవరాల్ గా ఈ చిత్రానికి సుమారు రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం ఇప్పుడు రానే వచ్చింది. పెద్ది సినిమాడిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 09 నుంచి రామ్ చరణ్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం (జులై 09) అర్ధరాత్రి నుంచే పెద్ది సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం స్ట్రీమింగ్ కు రావడానికి ఇంకొంచెం సమయం పట్టే ఛాన్స్ ఉంది.

వృది సినిమాస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ‘పెద్ది’ సినిమనాఉ నిర్మించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, కమెడియన్ సత్య, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్ది సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలని అనుకుంటున్నారా? మరెందుకు లేటు ఎంచెక్కా నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

నెట్ ఫ్లిక్స్ లో పెద్ది స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి